తులారాశి చిత్రార్థము, స్వాతి, విశాఖ, 3/4లో ఉన్నది. అశ్వని మొదలుకొని విశాఖ ఉన్నవరకూ ఉన్న నక్షత్రాలు ఉత్తరార్ధ గోళంలో ఉన్నవి. అయితే క్రాంతి వృత్తంలోని నక్షత్రాలు విశాఖ మొదలుకొని దక్షిణార్ధంవైపు మరలుతూ ఉన్నవి. ఇక్కడ ఒకవిధమైన శాఖాంతరం ప్రారంభించటం వల్లనే ఈ చుక్కలకు విశాఖ అనే పేరు వచ్చినట్లు కనిపిస్తున్నది. తుల అంటే సరిగా తూచి పంచేది అని అర్థము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించగానే శీతోష్ణాలు ఎక్కువ తక్కువ లేకుండా సరిసమానంగా ఉంటవి. అదేరీతిగా దివారాత్రాలు కూడాను. తుల మధ్యదేశాధిపతి శిబి అగ్ని పరీక్షకు ఆగిన మహాపవిత్రస్థానము. చాల్డియా, అసీరియా, అకేడియా దేశాల వారు కూడా ఈ రాశిని 'తుల్కు ' అని అంటున్నారు; దానికి కూడా తుల అనే అర్థము.
విశాఖ నక్షత్రమే రాధ. విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుని ప్రియ. ఆయన ఘోషుని భార్య. శరత్తులోనే కృష్ణభగవానుడు స్థావర జంగమాత్మికమైన చరాచర ప్రకృతి సమస్తమూ ముగ్ధ మయ్యేటట్లు మోహన వేణుగానం చేసింది. 'భూసతికిన్ దివంబునకు పొల్పెసగంగ శరత్సమాగమం బాసకల ప్రమోదకరమై ఒప్పుచున్న' దాని మహాకవులు ఈ కాలాన్ని గురించే చెప్పినారు కూడాను.
ప్రాణికోటిని మొరవెట్టేటట్లు చేసిన 'నరకుని సంహరించి ఇంద్రునికి (మేఘాధిపతి) సంతోషం కలిగించి, పారిజాతము (సముద్రంలో పుట్టినది) ను తీసుకొని రావటమూ సమస్తమూ ఒక రీతిగా కాలములోని మార్పును సూచించే సంజ్ఞాత్మకమైన కథనం (Symbolic expression) గా కనిపిస్తున్నది.
దీపావళి జైనులకు కూడా గొప్ప పండుగ. అయితే వారికి 'నరకాసుర వధా'ది పౌరాణిక దృష్టిలేదు. వారి దృష్టిలో ఇది ఐశ్వర్య సంబంధి. జైన వ్యాపారస్థులు ఆనాడు ధనపూజ చేస్తారు. వారూ ప్రమిదలలో - దీప పంక్తులుగా ఏర్పరచి - హారతులు తీర్చి దిద్దుతారు. జీన దేవుని నిర్వాణానంతరం అతని శిష్యులు పదునెనిమిది మంది రాజులూ ఒక గొప్ప సభ చేసి, 'జ్ఞాన దీపం (జినదేవుడు) వెళ్ళిపోయినాడు. కనుక మనము భౌతికపదార్థ దర్శనార్థం దీపాలను పెట్టి వెలిగిద్దామని' నిశ్చయించారట. ఆ నాడు మొదలు నేటివరకూ దీపావళినాడు వారు దీపావళీ సముత్సాహంలో పాల్గొంటున్నారు. వారికి దీపావళి నాలుగు దినాల పండుగ. మూడవ దినాన్ని మహావీరుని (జినదేవుడు) నిర్వాణదినంగా భావిస్తారు. మొదటి దినము ఇంట ఉన్న లక్ష్మీతుల్యాలని భావించే విలువైన పదార్థాలనూ, ప్రతిమలకు 'పులికాపు' చేసి, రెండవ ____________________________________________________________________________________________________
సంస్కృతి
341