గరఁగించి చంద్రుఁడను వెండిదిమ్మను బోయుటతో నిట్లైనదని వర్ణించుటచే మురారి 'ఇందుమురారి' యైనాఁడు.
ఇందుఁ డనిన భారతీయశబ్దవేత్తల కెంత యభిమానము! శశి సహజశీత లత్వమును గమనించి వారు చంద్రుఁడని (ఆహ్లాదనకరుఁడు) నామకరణమొనర్చినారు. అబ్జ శబ్ద మిచ్చి యతనిని నీటఁ బుట్టించియు, జైవాతృకుని గావించి యతనిచేఁ బైరుపచ్చలఁ బ్రతికింపఁ జేసియు నానందించినారు. మంత్రద్రష్టలైన వేదకాల మహర్షు లమృతతుల్యమగు సోమరస ప్రదానగుణముచేఁ జంద్రుని సోమునిగ దర్శించినారు. ‘సూర్యాచంద్రమసు’లను దేవతా ద్వంద్వమున శశినొకనిగ నిల్పి యతని తర్పణమునకై సోమయాగమును గల్పించిరి. అందు వారు వాగ్దేవతకై స్థూలశరీరమైన పశువు నుపయోగించి ప్రాణపంచకమును వరుణునకును, మనస్సు చంద్రునకు, శ్రోత్రముల దిక్కులకు, జీవాత్మను బ్రజాపతికి నీయవలయునని శాసించినారు. చంద్రుఁడు గంధర్వుఁడు, [1]సుషుమ్నః సూర్యరశ్మి శ్చంద్రమా గంధర్వః' యని శ్రుతి. 'గాం’ ధరిత్రేతి గంధర్వః.' రవికిరణ మీట గోవు. సుషుమ్న యను సూర్యకిరణమును ధరించుటచేఁ జంద్రుఁడు గంధర్వుఁడు. నక్షత్రము లప్సరసలు. అట్టి నక్షత్రములతో మిథునభావము నొంది చంద్రుఁడు క్రీడించు చున్నట్లొక [2]శతపథబ్రాహ్మణ మహర్షి దర్శించినాడు.
సూర్యచంద్రు లిరువురు నశ్వినీదేవతలు. ఇట నశ్వ శబ్దమునకు జలము, కిరణము, కాంతి యనువానిలో నే యర్థము నైన గ్రహింపవచ్చును.
లోకము చంద్రునికిఁ దారాజారత్వ మాపాదించినది. జారశబ్దమునకు లయించువాఁడని సంప్రదాయజ్ఞు లెఱిఁగిన యర్థము; యాస్కుని నిర్వచనము. సూర్యునకుఁ దల్లి రజని. రాత్రి యందు జన్మించి రవి రాత్రి యందు లయించు చున్నాఁడు. నక్షత్రాధీశుని తారాజారత్వము నిట్టిదే. ఇట్టి వైదిక సాహితీహృదయ సౌశీల్య మూహింపఁజాలని కవులు కొంద ఱిట్టి మార్మిక కల్పనలఁ గైకొని, పరకీయాప్రణయరస నిషణ్ణచిత్తులైన ప్రభువుల ప్రార్థనల సంగీకరించి యసభ్య శృంగార కావ్యరచనకుఁ బూనుకొనిరి. ఇట్టి యసత్యకల్పనలు కన్పట్టుట వలననే సుమేధులు “నా నృషిః కురుతే కావ్య" మ్మని యనుశాసింపవలసివచ్చినది.
చంద్రోదయాదికము ప్రకృతి పుస్తకమున నొక రమణీయ ప్రపాఠకము. దార్శనికులు తత్సౌందర్య రసవత్సన్నివేశములఁ దిలకించి యనేకాద్భుత విషయములఁ బ్రకటించిరి. యామవతీకళత్రు నుదయమునకుఁ బూర్వమతని కిరణము
లుదయించుటఁ గని యొక మహాకవి -____________________________________________________________________________________________________
30
వావిలాల సోమయాజులు సాహిత్యం-4