Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాంధర్వము ఉత్తమోత్తమ వివాహమన్నాడు ఒకచోట. అందువల్ల రజస్వలానంతర వివాహాలు కన్యావివాహాలుగానే పూర్వం పరిగణితాలైనవని అనవచ్చును. కన్యా వయోనిర్ణయం కూడా అవ్యవస్థంగా మారుతూ వచ్చినట్లు కనిపిస్తున్నది. దానిని కొంతగా ఇక్కడ సం[గ్రహించటం అవసరం.

భారతీయ గృహ్య సూత్రాలలో కొన్ని పిల్ల పుష్పవతి కానప్పుడు వివాహం చెయ్యమని, కొన్ని నగ్నికగా ఉన్నప్పుడే జెయ్యమని (హిరణ్యకేతి గృహ్యసూత్రము - 1-19-2) చెప్పినవి. నగ్నిక అంటే ఆసన్నార్తవ. మానవ గృహ్యసూత్రము పుష్పవతి కాని కన్యకను వివాహం చేసుకోమని చెప్పుతున్నది. (1-7-4) పారాశరగ్భహ్య సూత్రంలో నూతన వధూవరులు క్షారం తినకూడదనీ, మూడు రాత్రులు అధశ్ళ్చయనం చెయ్యమనీ మిథునకర్మ జరుపరాదనీ చెపుతున్నది (2-1-4) ఆశ్వలాయన (1-8-10), ఆపస్తంబ (8-8-89) సాంఖ్యాయన (1-1) మానవ (1-14-14) కాధక (80-1) ఖాదిర (౧-4-9) గోభిలీయ (2-3) గృహ్యసూత్రాలలోనూ ఇటువంటి నిబంధనలు కనిపిస్తున్నవి. ఆశ్వలాయన గృహ్యసూత్ర వ్యాఖ్యాత కాలంలో - క్రీ.శ. 1200 ప్రాంతంలో వివాహం కాగానే గర్భాధానం జరుగుతున్నట్లు ఆయన (గ్రంథంవల్ల వ్యక్తమౌతున్నది. అందువల్ల హరదత్తుని కాలం నాటి వైవాహిక వయస్సు కన్యకకు 14 సంవత్సరాలుగా నిర్ణయం చెయ్యవచ్చును. యాజ్ఞవల్మ్య (1-2) సూత్రగంథాలలో గర్భాధారణ వంటి చతుర్థికర్మ ఒకటి కనిపిస్తున్నది. ఈ కర్మ వివాహమైన తరువాత, అంటే పాణిగ్రహణానంతరం నాల్గవనాడు జరుగుతుంది. మూడు దినాలు గడిచిన తరువాత ప్రథమ సంగమం జరుగవచ్చునని కొందరు ఆచార్యుల మతం. ప్రథమ సంయోగము వ్రథమరజస్సు అగిపోయిన తరువాత జరుగవలెనని సాంఖ్యాయన (1-17-19) పరాశర (౧-11) ఆపస్తంబ (38-8-10) హిరణ్య కేశి (1-23) గృహ్యసూత్రాలు చెబుతున్నవి. కొన్ని గృహ్యసూత్రాలలో వివాహం జరుగుతుండగా ప్రథమరజోదర్శనమైతే వాటి ప్రాయశ్చిత్తం కనిపిస్తున్నది. బోధాయన (4-1-10) కౌశిక - (79-16) స్మార్తసూత్రాలు (6-18) మనుస్మృతి పుష్పవతి అయిన తరువాత మూడు సంవత్సరాలు గడిచిన తరువాత కన్యకకు తల్లిదండ్రులు వివాహం చెయ్యకపోతే, అమె స్వయంగా భర్తను వెతుక్కోవచ్చు అనే అనుశాసనం కనిపిస్తున్నది. మనువు ముమ్మారు పుష్పవతి అయిన తరువాత స్వయముగా పురుషుని వరించి సంయోగాన్ని పొందవలెనన్సీ నగ్నికగా ఉన్నప్పుడే వివాహం కావలెననీ కొందరన్నమాట తప్పనీ త్రోసివేసినాడు. వీటన్నింటిని బట్టి పరిశీలించినప్పుడు


సంస్కృతి

253