కానీ అటువంటి వ్యక్తులు కూడా వైవాహికానందాన్ని పొందటానికి వీలులేకపోలేదట. అది సంతాననిరోధము. వారు కొలది రాబడిలోనే జీవితాన్ని ఇముడ్చుకుంటూ సంతాన నిరోధక సామగ్రి (Contraceptives) సహాయంతో సంసారం పెరగకుండా చూచుకుంటూ, కొంతకాలం ధనం ఆర్జించిన తరువాత సంతానాన్ని పొందవచ్చుననే పాశ్చాత్య సంతాన శాస్త్రవేత్తలు కొందరున్నారు. బహుకాలము విశేషంగా సంతాన నిరోధక సామగ్రిని ఉపయోగించిన వధూవరులకు సంతానం కలగటం అసంభవ మనేవారు కొందరూ, కలిగే సంతానం కేవల తామసిక, రాజసిక ప్రవృత్తులతో ఉంటుందనేవారు కొందరూ లేకపోలేదు. నేటి ఆర్థిక స్థితిని అనుసరించి పాశ్చాత్య దేశాలల్లో వైవాహిక వయస్సు 20, 25 సంవత్సరాలు స్త్రీకినీ, పురుషుడికి 30 సంవత్సరాలు అనీ వివాహ గ్రంథకర్తలు నిశ్చయించారు.
వివాహానికీ, కన్యకలు రజస్వలలు కావటానికి కొంత సన్నిహిత సంబంధము కనిపిస్తున్నది. పుష్పవతులు కానివాళ్ళకు వ్యక్తిత్వముండదని ఐననూ కొందరికి లేకపోవచ్చును - సామాన్యాభి ప్రాయము. మగపిల్లలకు కూడా వ్యక్తిత్వానికి కొంత వయస్సు అంటూ ఉన్నది. మానసిక శాస్త్రవేత్తలు మానవ జీవితాన్ని 1. నగ్నత్వము (Infancy), 2. బాల్యము (Childhoold), 3. యౌవనము 4. ప్రౌఢత్వము (Adult life), వృద్ధాప్యము (Old age) అని విభజించారు. నగ్నత్వము ఏడు సంవత్సరముల వరకు, ఏడు మొదలు పదునాలుగు వరకు బాల్యము. అది మొదలు యౌవనము ఇరువది ఒక్క సంవత్సరమునకు. ప్రౌఢజీవనము 50 సంవత్సరముతో అంతమౌతుంది. తరువాత వృద్ధాప్యము. రోమక ధర్మ శాస్త్రములో స్త్రీ పురుష వ్యక్తిత్వ వయోనిర్ణయం కనిపిస్తుంది. అందు స్త్రీకి 12వ ఏటా, పురుషునికి 14వ ఏటా వ్యక్తిత్వం (Puberty) కలుగుతుందని నిర్ణయం జరిగింది. దీనిని బట్టి సర్వసామాన్యంగా పదనాలుగు సంవత్సరాల ప్రాంతములో వ్యక్తిత్వం స్త్రీ పురుషులిరువురికీ కలగటం ప్రారంభిస్తుందని మూకుమ్మడిగా చెప్పవచ్చును. కానీ ఈ వ్యక్తిత్వం కలగటం కూడా ఆ దేశాల శీతోష్ణస్థితులమీదా విశేషంగా ఆధారపడి ఉంటుంది. ఉష్ణ ప్రదేశాలలో కొంత వేగంగానూ, శీతల ప్రదేశాలలో కొంత ఆలస్యంగానూ బాలబాలికలకు వ్యక్తిత్వం కలగటము సహజమని అభిజ్ఞులు పలుకుతున్నారు. కొన్ని సమయాలలోనూ, సంఘాలలోనూ వారి వారి కామకళా జీవనం కూడా బాలబాలికలకు త్వరగా గానీ, ఆలస్యంగా గానీ వ్యక్తిత్వం కలగటానికి తోడ్పడుతుంటవి. ప్రపంచములోని కొన్ని దేశాలలో వ్యక్తిత్వాన్ని (Majority) అంగీకరించటానికి కేవలం రజస్వలాధర్మారంభాన్ని గానీ, ఉద్యద్యౌవనాన్నిగానీ పరిగణించక, యౌవన ప్రారంభానంతరము కొన్ని ____________________________________________________________________________________________________
సంస్కృతి
251