స్త్రీకి ఎటువంటి స్వేచ్ఛ లభించినా శారీరక సంయోగ విషయంలో పురుషుడే
ప్రధాన భూమిక (Primary Part) వహించటం తప్పదు. అతడు గృహజీవనంలో ద్వితీయ
స్థితిని పొందినప్పుడు ప్రణయ విషయంలోనూ ద్వితీయ స్థితిని పొందుతాడు. ఎంతగా
తన ఆధిక్యాన్ని చలాయిద్దామనుకున్న భార్య ఐనా ఎక్కడో అన్యమైన ప్రయోజనాలు
తప్ప కారణంగా నపుంసకుడిని వివాహమాడదు. ఒక్కొకప్పుడు భార్య భర్తలోని
కామశక్తిని సవ్యంగా వ్యాఖ్యానించు కొనలేక, వైవాహిక జీవనం కొంత గడచిన తరువాత
అతనికి అనురాగం తప్పిపోయిందనో, లేక వ్యభిచరిస్తున్నాడనో పొరబాటు కూడా
పడటం సంభవించి వైవాహిక జీవనానికి భంగం వాటిల్లే చేష్టలు చేయవచ్చును.
వివాహమైన మొదటి దినాల్లో ఇతఃపూర్వము చిదంబర రహస్యంగా ఉన్న దానిని ఆనందాన్ని - పొందవలెననే కుతూహలం వల్ల రమేచ్ఛ ఉదృతంగా ఉండవచ్చును. అది కాలక్రమేణా క్షీణించటమూ సహజము. కృత్రిమమైన వాంఛ తగ్గి సహజస్థితిని వారిరువురూ చేరుకున్నప్పుడే మానసిక నైతిక విషయాలలో అన్యోన్యత కలిగి, వైవాహిక విజయ జైత్రయాత్ర ప్రారంభిస్తారు.
స్త్రీలు ఏకశృంగారలు (Mono - erotic) పురుషులు బహుశృంగారులు (Poly- erotic) అనుకోవటం పొరబాటు. 'శారీరకంగా స్త్రీ అనేకమందిని ఆకర్షించినా ఆమె బిడ్డలకు వేరు వేరు తండ్రులను పొందటముగానీ, అనేక సంసారాలను నిలపడముగానీ పొసగదు. అందువల్ల వారు ఏకగమ్యులే గాని మానసికంగా బహుశృంగారలు' అని ఎల్లిస్ మహాశయుని అభిప్రాయము. ఈ సూక్ష్మమును గ్రహించుట వైవాహిక విషయానికి కొంత తోడ్పడుతుంది. ఒక భార్యాభర్తలు అన్యులచేత ఆకర్షితులైనప్పుడు వారి జీవితము సౌఖ్యప్రదమౌతుందని గాఢమైన నమ్మకం కలిగితే, వివాహ విచ్ఛేదావశ్యకత ఏర్పడుతుంది.
స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యాభిమానంతో ఉంటేగాని వైవాహిక జీవనము జయప్రదం కాదు. కేవలము శారీరకతృప్తి ప్రాధాన్యం వహించిన వివాహాలలో విజయవంతము లైనవి అత్యల్పము. మాతాపితృత్వవాంఛలో వైవాహిక జీవనం నెరపేవారికి సంతానము నిరంతరమూ వైవాహిక విచ్ఛిత్తి కలుగకుండా కాపాడుతుంటుంది.
నేటి వివాహ విధానాలలో ఉద్వేగానికి విశేష ప్రాముఖ్యాన్ని లోకం చూపటం లేదు. కేవలమూ శారీరక సౌభాగ్యానికి లొంగిపోయి కానీ, ఆర్థికాది సంపత్తికి తల ఒగ్గి కానీ వివాహ మాడేవారు, వైజ్ఞానికోద్వేగ సంబంధమైన సామ్యం దాని అంతట ____________________________________________________________________________________________________
246
వావిలాల సోమయాజులు సాహిత్యం-4