Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోకంలో అనేకమంది ప్రణయం సహజమైన అవబోధము (Instinct) అని భ్రమపడతారు. పరిశీలిస్తే మానవుడు తినటమూ, తాగటమూ, ఎలా నేర్చుకున్నాడో, అదేరీతిగా కామాన్ని కూడా నేర్చుకున్నాడు. ఇంకా విశేషంగా నేర్చుకోవలసి ఉంది. కేవలమూ ప్రకృతి ననుసరించటం వల్ల విశేషమైన ప్రయోజనం ఉండదు. దానికీ రసన (Taste) అవసరము. కామాన్ని పొందటంలో కళా మార్గాలను అనుసరించటము ఆరోగ్యానికి భంగమనీ, అది అసహజమైనదనీ కొందరు అమెరికా, ఇంగ్లండు దేశాలలోని భర్తలు భావిస్తున్నారట. ఇది పొరబాటు. ఏ రీతిగా మాతృత్వమునూ, భర్తృత్వ, భార్యాత్వములనూ కళలుగా భావిస్తున్నామో, అదేరీతిగా కామోపాసనమునూ ఒక కళగా భావించటము శ్రేయస్కరమని విజ్ఞుల అభిప్రాయం. అటువంటి అభిప్రాయంతో వైవాహిక జీవనం సాగినప్పుడు నేడు విశేషంగా 'విడాకుల' (Divorce) పాలౌతున్న అనేక సంసారాలలో విచ్ఛిత్తి ఉండదని ఎల్లిన్, యాడ్లర్, వాకర్ మొదలైన మానవజాత్యభిజ్ఞుల అభిప్రాయము.

శారీరకంగా వివాహము విజయవంతం కాకపోవటానికి విశేషంగా భర్తలు కారకులు. వారికి స్త్రీ పురుషులకు కలిగే విసృష్టి సుఖంలోని విభేదం తెలియుట అత్యవసరము. వారికి రతాంతరమున కలుగు శుక్ల క్షరణమున గాని సౌఖ్యం చేకూరదు. ఉపరతి (Tumscence) ఎరుగని భర్తకు రతమున (Da tumscence) భార్యను తృప్తను గావించే శక్తి ఉండదు. ఇతనికి కలిగే త్వరితస్థలనము శారీరకలోపము; వైద్యసహాయ మవసరము. స్త్రీలో కామం స్తబ్ధస్థితిని (Frigid State) పొందినప్పుడు ఆమె ఎటువంటి కామానుబంధాన్నీ (Sexual Intimacy) అంగీకరించదు. అది గమనింపని భర్త భార్యను ఉన్నిద్రను చేయటానికి యత్నించి విఫలు డౌతుంటాడు. పురుషుల్లో సంప్రయోగేచ్ఛ హఠాత్తుగా ఉత్పన్న మౌతుంటుంది. అది అతిశక్తిమంతము. స్త్రీలో నిద్రాణమై ఉంటుంది. దీనిని మేల్కొలపటానికే సమస్త దేశాలలోనూ ప్రాచీన కాలంలోనే కామతంత్రాలు బయలుదేరినవి. ఆధునిక భర్త అజ్ఞానం వల్లనూ, అపనమ్మకం వల్లనూ, దూరదృష్టి లేకపోవటం వల్లనూ వాటి పొంతపోక ప్రియాప్రసాధనం చేయలేకపోతున్నాడు. ఈ స్తబ్ధత కేవలమూ స్త్రీలలోనే కాదు; పురుషులలో కూడా ఉంటుంది. ఎల్లిస్ మహాశయుడు 'రెండు జాతులలోనూ నేటి దుష్టమైన విద్యావిధానం వల్లనూ, విశేషమైన వయస్సు వచ్చిన తరువాత వైవాహిక బంధనాలు ఏర్పడటము వల్లనూ, జాత్యజ్ఞానము (SexualIgnorance) వల్లనూ స్తబ్ధత ఏర్పడుతుందని అభిప్రాయమిచ్చాడు. ____________________________________________________________________________________________________

సంస్కృతి

243