వివాహం చేసుకుంటే వివాహ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి అతను స్త్రీలతో స్వేచ్ఛగా వ్యవహరించటానికి వీలు ఉండదు. ఈ సందర్భంలో మరొక చిత్రమైన ఆచారాన్ని కూడా గమనించవలసి ఉంది. కొన్ని ఆస్ట్రేలియా జాతుల్లో వివాహ వయస్సు రాని కుర్రవాళ్ళకు పెద్దవాళ్ళనిచ్చి వివాహం చేస్తారు. వారిని కులంలోని పెద్దవాళ్ళు అనుభవిస్తుంటారు. వివాహిత అయిన భార్య మరొకరిని వివాహం చేసుకొనే అధికారం ఉండదు. అందుమూలంగా కులంలోని వృద్ధులైన పురుషులకు యౌవన వతులను అనుభవించే అవకాశం లభిస్తుంది. ఇటువంటి ఆచారాలు కూడా ఒకానొక కాలంలోని వివక్షారహిత కామాన్నీ, బృంద వివాహ లక్షణాలనీ తెలియపరుస్తున్నవని కొందరి అభిప్రాయము.
గుంపు వివాహ పద్ధతిలో ఎప్పుడూ సంతానానికి తండ్రి ఎవరో కనుక్కోటము చాలా కష్టము. తల్లి ఎవరో చెప్పటము చులకన. అయితే ఆ తల్లి తన బిడ్డలనే కాకుండా ఆ వంశంలో ఉన్న పిల్లలనందరినీ తన బిడ్డలుగానే స్వీకరించి వ్యవహరిస్తుంది. తల్లివలెనే వాత్సల్యాదికాలను చూపిస్తుంది. అయినా ఆమె తన పిల్లలమీద ఇతరులమీద కంటే విశేషమైన మమకారం చూపిస్తుంది.
వంశక్రమము బృంద వివాహాన్ని బట్టి మాతృపర మౌతుంది. వంశాలు స్త్రీ నామం మీదనే చెల్లుబడి ఔతుంటవి. సామాన్యంగా అన్ని అనాగరిక జాతుల్లోనూ పూర్వం ఇదేవిధానం ఆచరణలో ఉండేది. గౌరవార్హతలు తల్లులకు విశేషము. ఈ విశేషాన్ని ప్రప్రథమంలో గమనించిన శాస్త్రజ్ఞుడు జౌబన్ మహాశయుడు. వంశక్రమాన్ని తల్లిమూలంగా గుర్తించడంలో ఆస్తిపాస్తులు తల్లిపరమై ఉంటవి గాని అవి సమష్టి కుటుంబానికి చెందినవి. అందువల్ల అవిభాజ్యాలు.
గుంపు పెళ్ళి ఆచరణలో ఉన్న కాలంలో కూడా ఒకవిధమైన రాక్షస వివాహము (Marraiges by Capture) ఉండవచ్చును. ఏ యువకుడైనా ఒక యువతిని బలాత్కరించి తెచ్చినా, చుట్టిముట్టి అనేకమంది మిత్రులతోనూ బంధువులతోనూ కలిసి ఎత్తుకోవచ్చినా, ఆమెను అపహరించటానికి సాయం చేసిన వారందరితో బాటు కొంతకాలం సమష్టిగా అనుభవించిన తరువాత ఆమె అతనికి ఆచార సమ్మతమైన భార్య ఔతుంది. అప్పుడు ఆమె భర్తల వంశంలోదిగా పరిగణిత ఔతుంది. వారిలో వారికి బాంధవ్యాలు ఏర్పడు తుంటవి. గుంపు పెళ్ళి విధానం అమలులో ఉన్నా వ్యక్తులు జంటలు జంజోయిగా తాత్కాలికంగానో, మరికొంత అధిక కాలమో భార్యాభర్తలుగా కలిసి జీవిస్తుంటారు. ఈ విధానంతో బాటు బహుభార్యాత్వమూ, బహు భర్తృత్వమూ కూడా బృంద వివాహం
238
వావిలాల సోమయాజులు సాహిత్యం-4