పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గానో కనిపిస్తుంది. అక్కడక్కడా బహుపత్నీత్వము కూడా ఉన్నట్లు తోస్తుంది. కొన్ని సందర్భాలలో వైవాహిక ధర్మానికి మోసకారులు (Infidels) కనిపిస్తారు.

ఇటువంటి తికమక ఉండటము వల్లనే అనేక దేశాలలో బృందవివాహ లక్షణాలను చూచి శాస్త్రజ్ఞులు మోసపోయినారు. ఎర్నెస్టు క్రాలే మహాశయుడు ఆస్ట్రేలియా జాతుల్లోకి నూపా, పిర్రారు భార్యలను జూచి అది బహుభార్యాత్వ లక్షణముగాని, బృంద వివాహ లక్షణము కాదనినాడు. పిర్రంగులకు జరిగే బృంద వివాహాన్ని కొందరు కాముక స్వేచ్ఛ (Sexuallicence) గా పరిగణించారు.

ఆస్ట్రేలియా జాతుల్లో కొన్ని పండుగలు వచ్చినప్పుడు యువతులను వివాహ యోగ్యలనుగా చేసే ఆచారం ఉన్నది. ఆ స్త్రీలలో వివక్ష లేకుండా కులంలోని పురుషులు అనుభవించటం వలన వారికి పరిణయ యోగ్యత కలుగుతుంది. ఈ ఆచారాన్ని చూచి శాస్త్రజ్ఞులు 'వివక్షారహిత కామము, (Promiscuity) బృందవివాహ లక్షణము అన్నారు. కానీ అది బృంద వివాహ లక్షణము గానీ, వివక్షా రహిత కామముగానీ కాదు. అది ఒక మతాచారము' అని కాలే అభిప్రాయపడినాడు. అంతేకాక ఆది అనే పాశ్చాత్య దేశాలలో మధ్యయుగం నాడు విశేష ప్రచారం ఉన్న ప్రభుహక్కుకు (Jusprimae noctis) ఆద్యంతమూ భిన్నమైనదని అభిప్రాయమిచ్చినాడు.

ఆస్ట్రేలియా డైరీ జాతిలో ఉన్న 'పిర్రంగు'ల విషయంలో ఒక నియమ మున్నది. ఆ నియమము అనేక జాతుల్లో కూడా ఉన్నది. భార్య అంటే, టిప్పుముల్కు, లేనప్పుడు మాత్రమే ఒక వ్యక్తి పిర్రంగుతో కాపురము చెయ్యవచ్చును. ఎటువంటి సందర్భములో నైనా ఆ వ్యక్తి పిర్రంగును భర్త దగ్గిరనుంచి బలాత్కరించి తీసుకోరావటానికి అవకాశం లేదు. ఈ 'పిర్రుంగు' ఆచారము ఒకానొక ఉపస్థితి (Initiation) ని తెలియపరుస్తుంది. భర్త లేనప్పుడు పిర్రంగుతో మరొకడు కాపురము చెయ్యటము కూడా బృంద వివాహ లక్షణాన్ని వ్యక్తపరుపదు. ఇది ఒకానొక కాలంలో దక్షిణ ఐరోపాలో ఉన్న సిసియేట్ (Ciciseate) వంటిదని ఆయన అభిప్రాయము.

ఈ లక్షణాలన్నీ గుంపుపెళ్లి లక్షణాలనీ, శాస్త్రజ్ఞులు ఒకానొక కాలంలో గుంపు పెళ్ళిళ్ళు ఉన్నవని ఎందుకు అంగీకరించటము లేదో తనకు అర్థము కావటము లేదనీ, అందువల్ల నేటి సభ్యజాతికి ఎటువంటి అగౌరవమూ ప్రాప్తించదనీ 'సంసారోత్పత్తి' రచయిత ఏంజెల్సు మహాశయుడి అభిప్రాయము. ఆస్ట్రేలియా జాతుల్లో యువకుడు చాలాకాలం అవివాహితుడిగా ఉండాలి. ఇది అతని బ్రహ్మచర్యం కోసం కాదు, ఆ జాతి స్త్రీల కామతృప్తి కోసం. అతను త్వరగా _______________________________________________________________________________________________________

సంస్కృతి

237