తరువాత జన్మించినది ఈ పునలియన్ వివాహ విధానము. గుంపు వివాహానికి
అటువంటి లోపం లేదు. ఒక కుటుంబంలోని స్త్రీలందరూ జన్మతః, మరొక
కుటుంబంలోని పురుషులకు భార్యలు. అదేరీతిగా కుటుంబములోని పురుషులందరూ
అవతలి కుటుంబములోని స్త్రీలకు భర్తలు.
బృంద వివాహ విధానాన్ని పరిశీలించి చూస్తే వివాహం గుంపుమీద జరుగు తున్నట్లు కనిపిస్తుంది. భార్యలు కాదగ్గ కులంలోని స్త్రీలు ఎంత దూర ప్రదేశంలోనైనా ఉండవచ్చును. అదేవిధంగా భర్తలు కాదగ్గ పురుషులు కూడా ఎంత దూర ప్రదేశాన్నైనా ఉండవచ్చును. ఒక పురుషుడు జన్మతః తనకు భార్య కాదగిన స్త్రీ దగ్గరికిపోయి నేను నీకు భర్తనని ఆమెతో భోగించవచ్చును. అదేరీతిగా ఒక స్త్రీ ఏ దేశంలో ఉన్నా జన్మతః భర్తృకుటుంబానికి చెందిన పురుషుని దగ్గరకు పోయి నీవు నా భర్తవని చెప్పి కామోపభోగాన్ని పొందవచ్చును.
ఈ వైవాహిక విధానం నేటి నాగరకుని దృష్టికి కలుషపూరితంగా కనుపించ వచ్చును. కానీ దీనిని గురించి ఒకానొక శాస్త్రజ్ఞుడు ఏమంటున్నారో గమనించవలసి ఉన్నది :
"వ్యభిచార గృహాలకు భిన్నమైన మార్గాన్ని దర్శించలేని ఫిలిస్టయన్ జాతులలో ఉన్న వైవాహిక విధానం కంటే ఇది చెడ్డది కాదు. ఫిలిస్టయన్ జాతుల్లోని వ్యక్తి బహిరంగంగానూ, గూఢంగానూ అనుభవించే కామోద్రేక జీవిత విధానం బృంద వివాహవిధానాన్ని అనుసరించే వ్యక్తులలో కనుపించదు. నేడు బృంద వివాహ విధానం లేదు. లోకంలో దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు మాత్రం ఆచారంగా వస్తున్నవి. వాటిని బట్టి చూస్తే అవి కేవలం దాంపత్య వివాహాల కంటెనూ, బహుపత్నీత్వ విధానం కంటెనూ, కొంచెం భిన్నంగా మాత్రమే కనిపిస్తవి. పూర్వం బృంద వివాహం ఉన్న జాతుల్లో కొన్ని సందర్భాలలో స్వేచ్ఛా సంభోగము మాత్రం కనిపిస్తుంది. ఈ హక్కు జన్మతః కలగటం చేత అది అనూచానంగా వస్తున్నది. ఈ ఆచారము క్రమక్రమంగా మాసిపోతున్నది. బృందవివాహ విధానము ఏ నాటికైనా నశించి తీరవలసినదే అయినా అది వివాహ పరిణామస్థితిని తెలియపరిచే ఒకానొక విధానము.”
పై శాస్త్ర కర్త అభిప్రాయపడినట్లే బృంద వివాహమును బహిరంగంగా చూసే వ్యక్తికి ఇది పట్టింపు విశేషంగా లేని దాంపత్య వివాహం గానో, లేక అనిబద్ధ ఏకపత్నీ వివాహము ఇంత కంటే ఏకగామిత్వము అంటే బాగుంటుంది - (Monogamy) ____________________________________________________________________________________________________
236
వావిలాల సోమయాజులు సాహిత్యం-4