కుమైట్ జాతి స్త్రీకి క్రొక్కీ జాతి పురుషుడు భర్త. అందరు క్రొక్కీలూ, అందరు కుమైట్లనూ
అందరు కుమైట్లూ అందరు క్రొక్కీలనూ వివాహమాడతారు.
ఈ వివాహ విధానము మధ్య ఆస్ట్రేలియా అనాగరక జాతుల్లోనూ కనిపిస్తున్నది. ఈరీ సరస్సుప్రాంతంలోనూ, డార్జిలింగ్ నదీ ప్రాంతాలనూ అక్కడక్కడా ఇటువంటి వైవాహిక విధానంతో నివసించే జాతులు నివసిస్తున్నారు. న్యూ సౌత్ వేల్సుకు సంబంధించిన 'కుమిలాఠాయ్' జాతివారు అనాది కాలంలో తల్లి కుటుంబము తండ్రి కుటుంబము అనే రెంటిని నాలుగు విభాగాలుగా చేసుకున్నారు. ఇందులో మొదటి రెండు విభాగాలవారు పుట్టుకతోనే భార్యాభర్తృ సంబంధం కలవాళ్ళు. తల్లి సంబంధాన్ని బట్టి వారి సంతానము 3వ విభాగానికీ 4వ విభాగానికి చెందుతుంటారు. 3,4 విభాగాల సంతానం వారిలో వారు వివాహం చేసుకుంటారు. వివాహానంతరము 3, 4 విభాగాలకు సంబంధించిన వారు, వారి వారి తల్లి హక్కును అనుసరించి తల్లి వంశంలో చేరుతుంటారు. ఈ పద్ధతిని అనుసరించి ఒక తరానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళ మధ్యనూ, అన్నదమ్ముల మధ్యనూ సంతానప్రాప్తి పనికిరాదు. అంటే వైవాహిక బంధము నిషేధిత మన్నమాట. వీటినుండి క్రమ క్రమంగా తల్లిని ఆధారం చేసుకొని కొందరు మూల స్త్రీలు (Women Ancestors) ఏర్పడినారు. వారి మూలంగా కొన్ని కుటుంబాలు ఏర్పడినవి.
కొన్ని మధ్య ఆస్ట్రేలియా జాతులలోని వివాహ విధానము పరిశీలిస్తే ఒకానొక కాలంలో ఆయా జాతుల్లో బృంద వివాహమున్నట్లు అర్థమౌతుంది. ఈరీ సరస్సు ప్రాంతంలోని జనంలో వివాహం రెండు విధాలుగా ఉంటుంది. 1. టిప్పు ముల్కు వివాహము 2. పిర్రారు వివాహం.
టిప్పు ముల్కు వివాహము వ్యక్తిగతము (Individual Marriage). ఈ వివాహ విధానాన్ని అనుసరించి ఒక వ్యక్తి ఒక భార్యతో కాపురం చేస్తాడు. 'పిర్రారు' వివాహ విధానంలో ఇద్దరు గాని, ముగ్గురు గాని అన్నదమ్ములు ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ అక్కచెల్లెళ్ళ వివక్ష లేకుండా వివాహం చేసుకుని అందరూ ఒక బృందంగా కాపురం చేస్తారు. ఇక్కడ అన్నలూ తమ్ముళ్ళూ ఏకగర్భజనితులు కానవసరం లేదు. ఒక భార్య భర్తను తనకు ఇటువంటివానిని పిర్రారుగా ఇవ్వమని అడగవచ్చును. ఒక స్త్రీకి పిర్రారు భర్తలు అనేకమంది ఉండవచ్చును. అదేవిధంగా ఒక పురుషుడికి పిర్రారు భార్యలు అనేకమంది ఉండవచ్చును. ఒక పురుషునికి ఒక స్త్రీగానీ, ఒక స్త్రీ ఒక పురుషునికి గానీ పిర్రారు కావటము సంఘంలో వారికున్న స్థానాన్ని బట్టి ఉండదు. ____________________________________________________________________________________________________
సంస్కృతి
233