'పునలియన్' వివాహ విధానాన్ని అనుసరించి ఏర్పడ్డ కుటుంబాలు రెండు
రకాలని వెనుక గుర్తించాము. వాటిలో ఏకగర్భాన పుట్టడం వలన పితృ సంబంధంగా
సహోదరత్వమూ, మాతృసంబంధముగా సహోదరత్వమూ ఏర్పడ్డది. వారందరికీ ఒక
తల్లి ఉంటుంది. ఆమె మూలముగా అక్కచెల్లెళ్ళు కాదగినవారు నియమితులౌతూ
ఉంటారు. వీరికి భర్తలు ముఖ్యంగా 'అన్నదమ్ములు' కాదగినవారిలో ఉంటుంటారు.
అందువలన మగవారు తల్లికి సంబంధించి ఉండటానికి వీలు లేదు. అందువల్ల
వారు తల్లి కూటమికి సంబంధించరు. అదే రీతిగా కులంలోని స్త్రీ సంతానం తండ్రి
కూటమికి సంబంధించి ఉండదు. ఈ విధంగా తల్లి జాతి తండ్రి జాతి వేరైనారు.
ఈ పునలీయన్ వివాహ విధానము క్రమక్రమంగా ఒక పురుషుడు ఒక స్త్రీతో తాత్కాలికంగానో, మరికొంత కాలంగానో వైవాహిక బంధం కలిగి ఉండే అవకాశానికి దారి తీసింది.
వివక్షారహిత కామోపభోగాన్ని అనుభవించే కాలంనుంచి పునలియన్ వివాహం అమలులోకి వచ్చే కాలంలో మానవజాతిలో గుంపు పెళ్ళిళ్ళు (Group Marriages) జరిగినవి. ఈ వివాహ విధానాన్ని అనుసరించి ఆ జాతులలోని స్త్రీ పురుషులు యావన్మందీ రెండు కూట బాహ్య కుటుంబాలుగా (Exogamous Families) విభజన పొంది ఉంటారు. ఒక కుటుంబంలోని వారు, స్త్రీలు యావన్మందీ, జన్మతః రెండవ కుటుంబంలోని పురుషులకు వివాహ సంబంధం వహించవలసిన వారై ఉంటారు. అదే రీతిగా అవతలి కుటుంబంలోని స్త్రీలందరూ ఇవతలి కుటుంబంలోని పురుషులు యావన్మందికీ పుట్టుకతోనే భార్యలై ఉంటారు. బృంద వివాహ విధానంలో ఇది ప్రాథమిక స్థితి. ఇటువంటి స్థితి ఆస్ట్రేలియాలో ఈ నాటికీ కనిపిస్తుంది.
దక్షిణ ఆస్ట్రేలియాకు సంబంధించిన మౌంట్ గాంబయర్ దగ్గిర నివసించే నీగ్రో జాతిలో ఈ ప్రాథమిక బృందవివాహం (Group Marriage) స్థితి కనిపిస్తున్నది. ఈ నీగ్రోజాతిలోని స్త్రీ పురుషులు యావన్మందీ క్రొక్కీ, కుమైట్ అనే రెండు కుటుంబాలుగా విభజన పొంది కనిపిస్తారు. క్రొక్కీలు క్రొక్కీలతో కామ సంబంధము, (వైవాహిక సంబంధము) కలిగి ఉండరాదు. కుమైట్లతో వారు వివాహం చేసుకోవచ్చును. అంటే కామ సంబంధము నెరపవచ్చునన్న మాట. అదే రీతిగా కుమైట్లు క్రొక్కీలతో వైవాహిక సంబంధము నెరపవచ్చును. వారిలో వారికి వైవాహిక వ్యాపారాలు పనికిరావు. అంతేకాదు, పుట్టుక చేతనే క్రొక్కీ జాతిలోని మగవానికి కుమైటు జాతి స్త్రీ భార్య; ____________________________________________________________________________________________________
232
వావిలాల సోమయాజులు సాహిత్యం-4