బృంద వివాహము
శాస్త్రజ్ఞులు అనాది మానవజాతుల వైవాహిక విధానాన్ని గురించి ఎంతోవిచారణ చేశారు. ప్రాథమిక స్థితిలో అది కేవలమూ శారీరక సంబంధమని నిర్ణయించారు. అనాది మానవ సంఘంలోని స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ శారీరక సంబంధంలో ఎటువంటి వివక్షా లేదని వారు అభిప్రాయపడినారు. దీనికే వివక్షారహిత కామము (Promiscuity) అని నామకరణం చేశారు. దీనిని బట్టి అతి ప్రాచీన కాలంలో ఎటువంటి వివక్షా లేకుండా స్త్రీ పురుషులు కామతృప్తి పొందేవారని నిశ్చయించవచ్చునన్న మాట.
అయితే ఈ వివక్షా రహితమైన కామోపభోగ స్వరూపం ఎటువంటిది? నేడు సంఘంలో ఉన్న నీతినియమాలూ, విధినిషేధాలూ ఆ నాడు లేవు. ఆ నాటి సంఘం కామసామ్యాన్ని (Sex Communism) పాటించేది. నేటి పరిభాషలో మాట్లాడితే అన్నకు చెల్లెలు, తండ్రికి కూతురూ భార్య లౌతారు; అక్కకు తమ్ముడూ, తల్లికి కుమారుడూ భర్త లౌతారు. బెహరింగు జలసంధి దగ్గర ఉన్న కలియక్కులలోనూ, అలాస్కాలోని కడైయక్కులలోనూ, బ్రిటిష్ నార్త్ అమెరికాలోని టెన్నెహిజాతిలోనూ ఇటువంటి స్వీయబంధు ప్రణయము (Incest) నేటికీ కనిపిస్తున్నదని 'సంసారోత్పత్తి' (Origin of Family) అనే గ్రంథంలో ఏంజెల్సు మహాశయుడు వ్రాసి ఉన్నాడు. చిలీలోనూ, చిప్పల్ ఇండియను జాతివారిలోనూ ఇటువంటి ఆచారము నడుస్తూ ఉన్నట్టు కొందరు యాత్రికుల వ్రాతల వల్ల తెలుస్తున్నది.
పైన పేర్కొన్న అనాగరిక జాతులకంటె నాగరకులనిపించుకున్న రోమనులు, పర్షియనులు, పార్థియనులు, హూణులు మొదలైన మరికొన్ని జాతులవారి చరిత్రలు చదువుతుంటే ఇటువంటి స్వీయబంధుప్రణయము నాగరక జాతుల్లోనూ చాలాకాలము వరకు గడచినట్లు కనిపిస్తుంది. కానీ తరువాతి కాలంలో ఈ ఆత్మ బంధు ప్రణయాన్ని కొన్ని జాతులు ఎబ్బెట్టుగా చూచారు. కొన్ని విధినిషేధాలు ఏర్పాటుచేసుకున్నారు.
మోర్గన్ మహాశయుని సిద్ధాంతాన్ని అనుసరించి ఇటువంటి వివక్షా రహితమైన కామోపభోగస్థితిలో నుంచే మొట్టమొదటి మానవ సంసారాలు (Human Families) ఏర్పడినవి. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన తాతలనూ తాతమ్మలనూ ____________________________________________________________________________________________________
230
వావిలాల సోమయాజులు సాహిత్యం-4