Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ హెన్రీ ఒకరి తరువాత ఒకరిని క్రమంగా ఎనిమిది మందిని వివాహమాడటం చరిత్రాత్మకమైన విషయము. సోలమన్కు ఎంత మంది భార్యలున్నారో చెప్పటం చాలా కష్టమని స్మిత్మైనర్ అనే చరిత్రకారుడు చెపుతున్నాడు.

అలీబాబా అంతఃపురంలో మూడువందల అరవై అయిదుమంది భార్యలు కాపురం చేసేవాళ్ళట! మొరాకో పూర్వరాజు ముల్లా ఇస్మాయెల్ కు 40 మంది భార్యలుండేవారట.అతడు చనిపోయేనాటికి 548 మంది కుమారులూ, 340 మంది కుమార్తెలూ ఉన్నట్లు వింతల చరిత్ర (History of odd things) వల్ల తెలుస్తున్నది.

ఈజిప్టు చక్రవర్తి రెండవ రామేసస్ కు మరణ సమయానికి 111 మంది మగపిల్లలూ, 51 మంది ఆడపిల్లలూ 'తండ్రీ' అని పిలిచేవాళ్ళు ఉండేవారు.క్రీ.శ. 1910వ సంవత్సరములో చనిపోయిన సయామ్ రాజు చేలారాముకు 3000 మంది భార్యలు, సంతానం 370 మంది - 134 మగవాళ్ళూ, 236 మంది ఆడవాళ్ళా

రాజుల మాటెందుకు? సామాన్యుల విషయంలోనూ అంతే. 'రేయిజ్ పలి' అనే హంగేరీ దేశ వైణికునికి 48 మంది కుమారులు.'టుటుచ్చి' బెల్జియమ్ బిషప్పుకు 61 మంది కుమాళ్ళు. రిరిలాల్ అనే రష్యాదేశ వర్తకునికి భార్యలు 72 మంది అని చరిత్ర వల్ల తెలుస్తున్నది.

బహుపత్నీత్వం అమలులోకి రావటానికి కారణము స్త్రీ పురుషుల జనసంఖ్య.యుద్ధాల కారణంగా అది తారుమారు పొందటం వల్ల ఈ వివాహ విధానం అమలులోకి వస్తూ ఉంటుంది. అంతే కాకుండా కొన్ని దేశాలలో స్త్రీ జనసంఖ్య విశేషంగా కూడా ఉంటుంది.

అందువల్ల మగవాళ్ళూ ఆడవాళ్ళూ జన సంఖ్యలో సరిసమానంగా ఉన్నంతమాత్రాన ఏకపత్నీత్వం అమలులో ఉంటుందని చెప్పలేము. జనసంఖ్య సరిసమానంగా ఉన్నంత మాత్రాన 'ఏకగామిత్వాన్ని' మాత్రమే చట్ట సమ్మతమైన వివాహ విధానంగా శాసించటానికి అవకాశం ఉండదు. అనాగరకజాతుల్లో స్త్రీలు విశేషంగా ఉండటం వల్ల బహుపత్నీత్వం అమలులో ఉంటుందని శాస్త్రకర్తల అభిప్రాయం.

ప్రపంచ వివాహ చరిత్రకారుడు వెస్టర్ మార్కు మహాశయుడు బహు భార్యాత్వానికి ఈ క్రింది కారణములను చూపినాడు. 1. జన సంఖ్య - పురుషులకంటె ఒక జాతిలో గాని దేశములోగాని అధికముగా ఉండటము, 2. స్త్రీ పురుష గృహజీవన విధానంలో —————————

209