Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈజిప్టు దేశంలో బహుపత్నీత్వాన్ని ధర్మశాస్త్రం అంగీకరించింది. కానీ ఆచారంలో ఆ వైవాహిక విధానం కనిపించదు. అయినా అది రాజవంశాలలో తప్ప సామాన్యజాతి వివాహ లక్షణంగా ఉండేది కాదు.


బాబిలోనియా దేశంలో హమ్మరీబాయి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏకపత్నీ వివాహమే - అంగీకృత వివాహము. కానీ భార్యకు రుగ్మత ఏర్పడినప్పుడు మరొక భార్యను వివాహం చేసుకోవచ్చును. లేదా ఉపపత్నిని స్వీకరించవచ్చును.


హిబ్రూ జాతిలో రెండవభార్య పనికిరాదు. అయితే ధర్మశాస్త్రంలో భార్యల మధ్య భర్త ఎటువంటి విభేదాన్నీ పాటింపరాదని కనిపిస్తున్నది. అందువల్ల ఈ భార్యలెవరు అనే శంక కలుగుతుంది. ఆ దేశంలో పురుషుడు సంతానం లేని అన్న భార్యను గానీ, తమ్ముని భార్యను గానీ విధిగా వివాహమాడక తప్పదు. ఇతఃపూర్వము ఆ వ్యక్తికి పెళ్ళి కావచ్చును లేదా కాకపోవచ్చును.


ఇస్రలైటు జాతిలో ఇంతమంది భార్యలు మాత్రమే ఉండవలెననే నియమం లేదు. సోలమన్ రాజుకు ఏడువేలమంది భార్యలట! కానీ టాల్మడ్ అనే వారి గ్రంథం నలుగురికంటే ఎక్కువమందిని వివాహమాడరాదని అనుశాసిస్తున్నది.


అరేబియా దేశంలో మహమ్మదు నలుగురు భార్యలకంటే ఎక్కువమందిని వివాహం చేసుకోరాదని ఆజ్ఞాపించాడు. కానీ ఆయన అమీరులు ఎంతమందినైనా ఉపపత్నులను ఉంచుకొని అనుభవించవచ్చునని అనుజ్ఞ ఇచ్చినాడు. వారికి తోడు ఎంతమంది బానిస స్త్రీలనైనా అనుభవించవచ్చు నన్నాడు. ప్రవక్త ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చునట! ఈ కారణంవల్లనే మధ్యయుగంలోనే జ్యూజాతిలో అంతరించిన బహుపత్నీత్వ విధానము, మహ్మదీయ దేశాలలో ఉన్న జ్యూజాతులో నేడు కూడా కనిపిస్తున్నది.


భారతదేశంలో మహమ్మదీయ రాజులు పరిపాలించిన కాలంలో అమీరులు నలుగురు భార్యలను తప్పకుండా వివాహం చేసుకునేవారట! దానికి బైరంఖాన్ చేసిన క్రింది అనుశాసనం గమనించదగ్గది. 'ఫర్మాయే కర్తే థే కి అమీర్ కేలియే చార్ బీబియాఁ చాహియే. ముసీబత్ ఔర్ బాతోం చీతోం కేలియే ఇరానీ, ఖానా సమాడే కేలియే ఖేర్ సానీ, సేజ్ కేలియే హిందుస్థానీ, చయే తుర్కిణీ, ఉషైహార్ వక్త్ మార్తే దాంతే రహైకి ఔర్ బీబియాఁ దరత్ రహే


సంస్కృతి

207