అయితే - మనం బహుభర్తృత్వం ఉన్న జాతుల్లో పురుషులు ఎక్కువగా ఉంటారనీ స్త్రీలు తక్కువని గానీ నిశ్చయించడానికి వీలుండదు. ఈ వివాహ విధానం స్త్రీ, పురుషుల ఆర్థిక ప్రతిపత్తిని బట్టీ, సాంసారిక విధానాన్ని బట్టీ ఏర్పడినది. తరువాత సంఘ ఆచారంగా పరిణమించినది.
కేవలం ఆర్థిక ప్రతిపత్తి మూలంగా ఈ బహుభర్తృత్వ విధానం ఏర్పడుతుందని చెప్పటానికి వీలు లేదు. ఈ విషయం బహుభార్యాత్వ విధానాన్ని పరిశీలిస్తే వ్యక్తమౌతుంది.
ఆస్ట్రేలియా అనాగరిక జాతుల్లోని 'బుష్ మన్'లలో ఎంతటి పేదవారికైనా నలుగురైదుగురు భార్యలుంటారు. ఆ జాతిలో కొద్దిపాటి సామంతుడికి పదిమందికి తక్కువ కాకుండా భార్యలుంటారు. 'చెనిక్' జాతి రాజుకు భార్యలని చెప్పుకున్నవారు ఎందరుండేవారో చెప్పలేకున్నారట! కొందరు ఆరువందలన్నారు, మరికొందరు వేయిమంది అనీ, కొందరు వీరిని అయిదువేల వరకూ పెంచినారు. ధర్మశాస్త్రం రాజయినవాడు 8888 మంది కంటె ఎక్కువ భార్యలను వివాహమాడకూడదని ఉన్నదట. ఉగాండా రాజుకు, ఆయన పేరు మొటిస్సా ఏడు వేలమంది భార్యలుండేవారట! పదహారువేలమంది గోపికలూ చరిత్రాత్మక వ్యక్తులైనట్లయితే మన కృష్ణభగవానుని మించినవాడు ఎవరూ ఇతః పూర్వం పుట్టినట్లు కనిపించటం లేదు. ఇకముందు పుట్టే అవకాశం కూడా లేదనవచ్చును.
ఈ రాజులు ఇంతమంది భార్యలనూ వివాహమాడినారా? అనే ప్రశ్న కలగక
మానదు. అయితే వీరిలో ఎక్కువభాగం ఉంపుడుకత్తెలై ఉంటారు. వారికి కూడా
భార్య అనే పేరు ఉండేది. ఒక చారిత్రికుని లెక్క ప్రకారము శ్రీకృష్ణరాయలకు
నాలుగువేల నూట ఒక్కమంది భార్యలున్నట్లు తెలుస్తున్నది. కానీ ఆయన చిన్నమదేవీ
జీవిత నాయకుడు; తిరుమలదేవీ, వరదాంబికలను అగ్నిసాక్షిగా ఆయన
వివాహమాడినాడు. మిగిలిన వారి కందరికీ ఆ నాడైనా సంఘంలో విశేష గౌరవం
ఉండేది కాదు. భర్త అని చెప్పుకోదగ్గ వ్యక్తిమీద శారీరకమైన హక్కు కూడా ఉండేది
కాదు.
పూర్వం చైనాలో రాజు న్యాయసమ్మతంగా ఒక భార్యకంటే ఎక్కువమందిని
వివాహం చేసుకోవటానికి వీలు వుండేది కాదు. ఉపపత్నిని మరొకదానిని
స్వీకరించటానికి ధర్మశాస్త్రమే అంగీకరించేది. ప్రథమ భార్యకు ఉంపుడుకత్తెమీద
విశేషమైన అధికారం ఉండేది.
206
వావిలాల సోమయాజులు సాహిత్యం-4