తూర్పు హిమాలయ ప్రాంతంలో 'తెప్పాలన్' అనే జాతివారున్నారు. వారిది ఆటవిక జీవనం. వారిలో బహుభర్తృత్వ మున్నదని ప్రతీతి. కాని ఒక భార్యతో ఇద్దరన్నదమ్ములూ ఏకకాలంలో కాపురం చెయ్యరు. ఒకరు ఊళ్ళో లేనప్పుడు మరొకడు ఆమెకు సాంసారిక సౌఖ్యాన్ని కలిగిస్తుంటాడు. ఈ జాతిలో భార్య ముఖ్యంగా మొదటివాడినే పెళ్ళాడుతుంది. దీనిని బట్టి ఈ విధానం బహుసోదరభర్తృత్వం (Adelphic Polyandry) అని చెప్పవచ్చును. ఈ జాతిలో స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నా అతని తమ్ములందరితోనూ కామ సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మగవాడూ అన్న భార్యతోనూ, ఆమె చెల్లెళ్ళతోనూ మిథునక్రీడ సలుపుతూ ఉండే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. వారికి పెళ్ళి అయినా సరే, కాకపోయినా సరే.
కానీ మరొక చిత్రం గమనించవలసి ఉన్నది. ఒక కులంలో పెద్దవాడు తమ్ముళ్ళ
భార్యలతో శారీరక సంబంధం కలిగి ఉండటం ఆత్మబంధు ప్రణయము (Incest) గా
భావిస్తారు. తమ వంశంలోగానీ, కుటుంబంలో గానీ పుట్టిన స్త్రీతో సంభోగ సంబంధం
కలిగి ఉంటే ఎంతో తప్పిదంగా భావించి, కులంలోనుంచి బహిష్కరిస్తారు.
టర్కీ దేశంలో ఒకానొక కాలంలో బహు భర్తృత్వం తప్ప మరో వైవాహిక
విధానం లేదని మెసగటీ అనే చరిత్రకారుని వ్రాతలవల్ల తెలుస్తూ ఉన్నది. అయితే
భార్యకు ఎవరివల్ల సంతానం కలిగినా, ఆ సంతానం మీద హక్కు మాత్రం పెద్ద
అన్నది. పిల్లలందరికీ తండ్రి అతడు మాత్రమే. మిగిలిన వారు పినతండ్రులు. పిల్లలు
అతనిని ఒక్కడినే 'నాన్నా!' అని పిలుస్తారు. భార్య గర్భిణిగా ఉంటే
ప్రసవించేటంతవరకూ ప్రథముని దగ్గిరనే ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో నాయర్ జాతిలో ముగ్గురు నలుగురు పురుషులు సమష్టిగా
ఒక స్త్రీని వివాహమాడుతారు. వారిలో ప్రతి ఒక్కరూ మరి ముగ్గురితోనో, నలుగురితోనో
కలిసి మరొక భార్యను వివాహం చేసుకుంటారు. అదేరీతిగా మూడవభార్యనూ, నాల్గవ
భార్యనూ, ఐదవ భార్యనూ - ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చును. ప్రతి స్త్రీకి
మొదట్లో ఒక పురోహితుడు మంచి ముహూర్తాన తాళికట్టి మొదట తాను వివాహం
చేసుకున్న తరువాత ఈ విధంగా జరుగుతుంది.
మెక్లినన్ అనే శాస్త్రకారుడు ఈ వివాహం బహుభర్తృత్వ విధానం క్రింద చేరదని అభిప్రాయపడినాడు. 'గిరాడ్-ట్యూలన్' అనే శాస్త్రజ్ఞుడు చెప్పినట్లు ఇది ఒక విధమైన
204
వావిలాల సోమయాజులు సాహిత్యం-4