ఈ వివాహ విధానం దక్షిణ అమెరికా ఇండియన్లలోనూ, అలాస్కా జాతుల్లోనూ, కొన్ని ఆఫ్రికా జాతుల్లోనూ నేటికీ కనిపిస్తున్నది. తిబ్బెత్తు దేశంలోనూ, కాశ్మీరములోనూ, హిమవన్నగప్రాంతాలోని కొన్ని కొండజాతుల్లోనూ, తోడాలలోనూ, కూర్గులలోనూ, నాయర్లలోనూ ఇటువంటి వైవాహిక సంబంధం ఉన్నట్లు సాంఘిక శాస్త్రజ్ఞులు గమనించినారు.
అమెరికా ఇండియన్ జాతుల్లో క్రీ.శ. 1402 ప్రాంతంలో ప్రతి స్త్రీకి తప్పకుండా
ముగ్గురు భర్తలుండేవారట! ఆమె నెలల వారీగా ఒక్కొక్క భర్త యింటికి వచ్చి కాపురం
చేస్తుండేదట!
మెడగాస్కరు, మలై ఆర్చిపెలగోలలో ఈ ఆచారం నేటికీ సకృత్తుగా కనిపిస్తున్నది.
మార్షలు ద్వీపాలలో ఈ ఆచారము విపరీతంగా గోచరిస్తుంది. ఇక్కడ జాతులు
వైవాహికాచారాన్ని అనుసరించి భర్తలు రెండు రకాలు. ఒకడు ప్రధాన భర్త. ఇతరులు
అప్రధాన భర్తలు. అంటే ఉపపతులన్నమాట! శాస్త్రోక్తంగా వివాహమాడిన భర్త
సోదరులు ద్వితీయ శ్రేణికి చెందిన భర్తలు. అంతేకాకుండా ఆమె చెల్లెళ్ళందరూ
భర్తకు ద్వితీయ శ్రేణికి చెందిన భార్యలు. వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకపోతే ఇతరులను
చేసుకోవచ్చును. అప్పుడు వారు వివాహమాడే వ్యక్తులు ప్రధాన భర్త లౌతారు. దీనిని
బట్టి ఒక స్త్రీ భర్తలందరూ తప్పకుండా ఏకోదరులు కావలెననిగానీ, ఒక పురుషుని
భార్యలందరూ ఏక గర్భజనితలు కావలెననిగానీ నియమం లేదు.
కాశ్మీర సంస్థానంలో ఉన్న 'లొడకల్' అనే జాతిలో ఈ వివాహ విధానం ఇంకా
చిత్రంగా కనిపిస్తుంది. ఒక కుటుంబానికి చెందిన పెద్దకొడుకు ఒక స్త్రీని వివాహం
చేసుకుంటాడు. అతని భార్యద్వారా యావదాస్తీ వస్తుంది. అతడే మిగిలిన కుమారుల
నందరినీ పోషించవలసి ఉంటుంది. కేవలం పోషణతో నిలువదు. ఆమె
అన్నదమ్ములందరికీ సమాన ప్రతిపత్తి గల వ్యక్తి; భార్య, అంతేకాకుండా ఆమె
కోరుకుంటే మరికొంతమంది ఇతరులను కూడా వివాహం చేసుకోవచ్చును. అయితే
వారికి ఆమె ఆస్తి పాస్తులలో హక్కు కలగదు. ఆ వివాహం కేవలమూ శారీరకభోగం
కోసమే.
హవాయి ద్వీపంలో స్త్రీకి తప్పకుండా ఇద్దరైనా భర్తలుండాలి. లేకపోతే సంఘంలో
ఆమెకు గౌరవం లేదు. ఆమె భర్తలందరితో ఏకకుటుంబంగా జీవిస్తుంది. ఆమె అందరికీ
సమానమైన భార్య. వీరి ఆచార వ్యవహారంలో ఒక స్త్రీ భర్తలందరూ తప్పకుండా
ఏకోదరులు కావలెననే నియమం ఉన్నది.
సంస్కృతి
203