మరియొకరు ఈ వివాహ వయస్సు కేవలము ప్రాచీనార్య విద్యావిధానం మీద ఆధారపడి ఉంటుందనీ, ఆ నాటి యువకుని విద్యాపరిపూర్తికి ఇరువది నాలుగు, ముప్పది రెండు సంవత్సరాలు పట్టేదనీ అభిప్రాయపడినారు. మానవ జీవిత ప్రమాణమని చెప్పుకుంటూ ఉన్న నూరు వత్సరాలనూ మూడుభాగాలుగా విభజించి, మానవుడు ఒక్కొక్క విభాగాన్ని త్రివర్గాలకూ క్రమంగా ఉపయోగించవలసి ఉంటుందని వాత్స్యాయన ఋషి పలికినాడు. మనువు నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క పాదమునకు పాతిక వత్సరాలని నియమించాడు.
రాముని వివాహ సమయానికి అతని వయస్సు 16 సంవత్సరాలు, సీతకు
6 సంవత్సరాలు. (బాలకాండ 17 అరణ్యకాండ. 47) చాణక్యుడు ప్రతిక్షత్రియ
కన్యకనూ 16వ ఏట వివాహం జరిగి తీరాలని నీతిశాస్త్రంలో నియమించాడు. కన్యక
వయస్సును గురించి లక్షణాలు నానారకాలుగా కనిపిస్తున్నవి.
కన్యకను వివాహం చేసుకోటంలో ఓ అంతరార్థమున్నది. అందు మూలంగా
ఆమె భర్తృ గృహవాతావరణాన్ని పొంది గృహస్థ ధర్మాన్ని నెరపే సమయానికి స్వేచ్ఛగా
ప్రవర్తించే వీలు కలుగుతుంది.
హిందూ వివాహంలో యువతీయువకుల ప్రమేయం తక్కువ. యువకుల
ఉద్రేకోత్సాహాలను అరికట్టే ప్రయత్నము ఇందులో కనిపిస్తుంది. కాని హిందూజాతి
వివాహంలో జాత్యభ్యుదయమే ప్రధాన ధర్మమైనట్లు సుస్పష్టంగా గోచరిస్తుంది.
వధూవరుల కన్యోన్యమూ అనురాగం లేని వివాహం నిష్ప్రయోజనమైనదనే మాట
నిజమే. కాని కాలక్రమేణా కలిగే మానసికమైన అసంతృప్తి శారీరకమైన అసంతృప్తి
అంతకంటే గొప్పవి.
వరణమంటూ హిందూ వివాహంలో ఒక తంతు ఈ నాడు కనిపిస్తుంది.
పూర్వము ఆచారంగా కూడా ఉండి ఉంటుంది. అయితే ఇది అన్యదేశాలలో వలె
లింగ సంబంధమైనది (Sexual) మాత్రము కాదు. సంతాన శాస్త్రజ్ఞులు పాశ్చాత్య
దేశాలలో జాత్యభ్యుదయాన్ని మనస్సులో పెట్టుకొని రక్షకభటవర్గం చేత బలవంతంగా
యువతీయువకులను భార్యాభర్తలు కాదగ్గవారిని ప్రభుత్వమే ఎన్ని వివాహం చేయటము
మంచిదని అభిప్రాయపడ్డారు. జంతుకోటిలో ఈ రీతిగ బలవంతంగా ఎద అయ్యేటట్లు
చేయించటం వల్ల మంచిజాతి జంతువులు పుడుతున్నవి. హిందువులు సంతాన శాస్త్ర
సూక్ష్మాలను ఏ నాడో గ్రహించిన వారు కావటం చేత యువతీయువకుల తాత్కాలిక
ఉద్రేకోత్సాహాలకు వివాహ సంస్థను ఒదిలిపెట్టి భగ్నం చేయలేదు.
సంస్కృతి
197