నిత్యబ్రహ్మచర్యమంటే కేవలం ఆత్మ స్వరూపాన్ని చంపుకోవటమనీ, అది అవమానకర కృత్యమనీ ఆర్యుల తలపోత. అది కేవలమూ మాతాపితృత్వాన్ని (Parenthood) వహించటానికి జంకటం తప్ప అన్యం కాదని వారి అభిప్రాయం.
ఆర్యధర్మ శాస్త్రవేత్తలు పితృదేవతలను తృప్తి పొందించటానికి సూనుడు (పుత్రుడు)
అవసరమన్నారు. వారి నిత్యనైమిత్తిక తర్పణాలకు సూనుడు అత్యవసరము. 'సూను'
శబ్దానికి మొగ్గ అని అర్థం. ప్రాణాంశాల సంయోగం వల్ల ఈ మొగ్గ కలుగుతుంది.
తండ్రే మాతృగర్భాన్ని చేరి కుమారుడుగా పుట్టి ప్రజాతంతువును పొడిగిస్తూ, జీవ
ప్రవాహానికి దోహద సేవ చేస్తాడని వారి నమ్మకం. పితృదేవతలు ఈ ప్రాణసూత్రం
తెగిపోకుండా చూచుకోటానికి సృష్ట్యాది నుంచే వస్తూ ఉన్న వ్యక్తులు. దీనినే ఆధునిక
పరిభాషలో చెప్పితే 'వైమనిజమ్' అనవచ్చును.
'జీవం ఒక ప్రాణాండం నుంచి మరొక ప్రాణాండానికి ప్రవహించే నది వంటిది'
అని బెర్గసన్ అనే శాస్త్రవేత్త నిర్వచించాడు. అయితే ఆయన ఆర్యులు చెప్పినట్లు
దానిని అడ్డుకోటం పాపం అని అనలేదు. శరీరము భగవత్ప్రసాదం, సృష్టికర్తృత్వాన్ని
ప్రసాదించే శక్తిని ఉపయోగించుకోకపోవటము తెలివి తక్కువ. పూర్వులు లేకుండా
తానింతవాడు కాగలడా? పితృభక్తి ఉన్నవాడు ఆర్యధర్మాన్ని అనుసరించి వివాహం
చేసుకోవలసినదే; పితృఋణం సంతానముఖాన తీర్చుకోవలసినదే.
సాంఘికవ్యవస్థ ననుసరించి పరిగణించినా పుత్రుడు కలగటం కేవలము
విజయంగా కనిపిస్తుంది. ఆ పుత్రుడు తనంతటి వ్యక్తి అయి లోకంలో తన్ను
మరపింపజేస్తూ ఉంటే ఆనందించని పితృహృదయం, ఏ దేశంలో వుంటుంది?
కుమారుడు లేని స్త్రీ భర్త మరణానంతరం ఒక అబీజ. 'పుత్ర' శబ్దంలో మరింత
విశేషార్థం గోచరిస్తూ ఉన్నది. వ్యక్తి తన జీవిత కాలంలో తీర్చుకోలేని కోరికల నన్నిటినీ
తీర్చేవాడు పుత్రుడు. అతడు ఏ పాపాలు చేసినా తిరిగీ కుమారుడి కడుపున పుట్టి
పాపాన్ని పాపుకుంటాడు. కుమారుని కనటం భారతీయునికి కేవలం పితృదేవతల
కోసం కాదు; తనకోసం కూడాను. 'ఆత్మజ' శబ్దంలో నా వల్లనే పుట్టినవాడు; అన్యుడు
కాడు అనే అర్థం అవగతమౌతున్నది. పితృదేవతాపూజనం అంటే ఏమీ వింత విశేషం
గాదు. లోకంలో అంతర్వాహినిగా అనంతకాలం నుంచీ వస్తూ ఉన్న జీవనదిని దర్శించి
ధ్యానించడం.
ఆర్యసంఘానికి అనార్య సంపర్కమూ కలిగింది. అందుమూలంగా అనేక విలోమ
జాతులు ఏర్పడ్డవి. ఒకానొక కాలంలో వర్ణాంతర వివాహాలున్న ఆర్యజాతి లక్షణాలను
మార్చుకొని ఏ వర్ణంవారు ఆ వర్ణంలో వివాహం చేసుకోవాలి అని నియమించుకున్నది.
సంస్కృతి
193