Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసుకుంటే గాని జీవనోపాధి దొరికేది కాదు. ఈ రోజుల్లో పురుషుడితోబాటు సమాన ప్రతిపత్తి చేకూరుతున్నది. చేకూరుతుంది. పురుషులవలె స్త్రీలు కూడా స్వతంత్ర జీవనం చెయ్యగలరు. స్వతంత్ర గృహనిర్మాణం చేసుకొనగలరు. భోగభాగ్యాలను అనుభవించగలరు. జీవితానికి ఆనందానుభవాన్ని కలిగించేది బిడ్డలు ఒక్కరే కాదు. విశాల విశ్వంలో పురుషుడికి ఎన్ని ఉన్నవో స్త్రీకీ అన్ని మార్గాలున్నవి.


నిత్యమూ ప్రపంచంలో ఏదో మూలనుంచి కామతంత్రాన్ని మూసి పెట్టకూడదు. స్త్రీ పురుషులు యావన్మందీ ప్రత్యేక శాస్త్రంగా దీన్ని పఠించి తీరాలి; ఇందులో సారస్యాలను గ్రహించి అనుభవించాలి అనే వివాదాలు వినిపిస్తూ ఉన్నవి. అంతేకాకుండా పురాతన కాలంలో వలె ఎబ్బెట్టులేకుండా అసభ్యతగా పరిగణించ కుండానే స్త్రీ పురుషులు ఒకచోట చేరి కామశాస్త్రరహస్యాలను బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో చలనచిత్రాల మూలంగా జాతిశాస్త్ర (Sexual Science) విజ్ఞానం వెదజల్లటం జరుగుతున్నది. మున్ముందు ప్రాచ్యదేశాలు కూడా దృశ్య విద్య (Visual Education) మూలంగా ఈ విధానాన్ని అనుసరిస్తవి. అందులో అణు మాత్రము సందేహము అనవసరము.


కొంతకాలం బ్రహ్మచర్యాన్ని గడిపినా కామము విషయము ఏమి చెపుతావని ప్రశ్నించేది నేడు యువకుడొక్కడే కాదు, యువతి కూడాను. ఏనో నిష్ప్రయోజకాలైన వైరాగ్యోపన్యాసాలిచ్చి ఆమె మనస్సును త్రిప్పటానికి ప్రయత్నించడం వల్ల విశేషమైన ప్రయోజనం ఉండబోదు, ఉండదు. ఇటువంటి సమస్యను సహజమైన ఆర్ద్రదృష్టితో ఎదుర్కోటం వ్యక్తిపరంగానూ, సాంఘికంగానూ శ్రేయస్కరము.


సమాజం నుంచి మరికొందరు మరొక ప్రశ్న వేస్తున్నారు. తల్లికి పిల్లవాడిని పెంచుకునే ఆర్థికశక్తి స్వతంత్రంగా ఏర్పడ్డప్పుడు పొందే హక్కు న్యాయశాస్త్ర మూలంగా ఎందుకు ఉండకూడదు అని. అప్పుడు వారికి వివాహబంధం ఎందుకు? అది కేవలమూ స్త్రీని పురుషునికి బానిసగా జేయటంతప్ప అన్యమౌతుందా? ప్రభుత్వంగానీ, సంఘంగానీ భర్తను కోరే యువతికి భర్తను చూపలేకపోవటం వల్ల శక్తిమంతమైన మాతృత్వం ఉన్న స్త్రీ వ్యభిచరించటం దోషమా? - అయితే ఈ తప్పు సంఘానిదా? ప్రభుత్వానిదా? వ్యక్తిదా?


పురుషులకంటే స్త్రీలు విశేషంగా ఉన్న దేశంలోగానీ, జాతిలోగానీ, సంఘంలో గానీ, స్త్రీలందరికీ భర్తలు దొరకటం చాలా కష్టం. వివాహ విషయంలో ఆధునిక మానసికస్థితి లోతెరిగిన ఒక వేత్త కొన్ని అభిప్రాయాలిచ్చాడు. "వంధ్యాత్వం


సంస్కృతి

185