Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము - స్త్రీ పురుషులు


న్యాయతః వివాహం లేకుండానే స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యం ప్రేమించుకుంటూ కాపురం చెయ్యవచ్చును. సంఘానికి గానీ ప్రభుత్వానికి గానీ వారి జీవన విధానంతో ఎటువంటి జోక్యమూ అవసరం లేదు.

స్త్రీ పురుషులిద్దరూ ఒక సంఘంలో నివసిస్తున్నారు, కాబట్టిన్నీ, ఒక ప్రభుత్వానికి లొంగి ఉన్నారు కాబట్టిన్నీ, సంఘానికీ వారికీ ప్రభుత్వానికీ కొంత సంబంధం ఉన్నది. అందువల్ల ప్రణయ విధానాల్లో స్త్రీ, పురుషులిద్దరూ వ్యక్తిగతమైన వారి స్వేచ్ఛను కొంతగా అరికట్టటము అవసరం వచ్చింది. ఈ సంఘ నియమాలు వైవాహిక విధానంలోనూ ప్రణయ విధానంలోనూ నాగరిక అనాగరక సంఘాలు రెండూ అవలంబిస్తున్నవి.


నియమాలంటూ లేని దేశంగాని, జాతిగాని లేదు. అన్నివేళలా అడవి జంతువులను వేటాడి పొట్ట బోసుకునే ఆటవికుల్లోనూ ఈ నియమాలున్నవి. పశుపాలనం వృత్తిగా పెట్టుకొని దేశ దిమ్మరులుగా జీవించే జాతుల్లో కూడ ఈ నియమాలున్నవి. పట్టణాలలో నిరంతరము యంత్ర కర్మాగారాల్లో నివసించే పారిశ్రామిక జీవులకు గూడా ఈ నియమాలున్నవి. మానవుడు ఎటువంటి అనాగరిక స్థితిలోనూ నియమరహితమైన ప్రవృత్తి (Sexual Promiscuity) తో జీవించాడని చెప్పటానికి అవకాశం లేదు. అట్లాకాకుండా ఏ కాలంలోనూ, ఏ జాతిలోనూ కామక్షుత్తు (Sexual appetite) ఇష్టం వచ్చినట్లు తీర్చుకునే అవకాశము ఏ నాడూ మానవుడు అవలంబించలేదని నిర్ధారణ చేసి చెప్పవచ్చును.


కామతృప్తి కోసం ప్రతిజాతీ ఏర్పరుచుకున్న మూలాధార మేమిటి? సంసారమనేది, సంఘానికి పునాది. అందువల్ల ఈ నియమాలు సంసారాన్ని ఆధారం చేసుకుని, ఏతద్రక్షణార్థంగా నానా విధానాలైన మార్పులను పొందుతూ ఉన్నవని చెప్పటంలో అసంబద్ధత అణుమాత్రంగా ఉండటానికి అవకాశం లేదు.


కామానికి గానీ, కామశాస్త్రానికి (Sexual Science) గానీ సంబంధించిన నియమాలు అన్నిజాతుల్లో ఒకరీతిగా ఉండవని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ప్రతి జాతి ఒక విషయాన్ని అంగీకరిస్తుంది. ఏ జాతిలోనూ స్వబంధు ప్రణయము సంస్కృతి


సంస్కృతి

181