97.Chapter VII - INCEST, Physical Love in the Family R. J. Mehta - Scientific Curiosities of Sex Life pp. 60-67. కాని ఇది పురాతన ఇరాను ఈజిప్టు రాజవంశములలోని వైవాహిక సంబంధమైన స్వీయబంధుప్రణయము వంటిది కాదు. ఇది వ్యావర్తనకము. 'తథా ప్రవేశిభి రేవజ్ఞాతి సంబంధేభి ర్నాన్యై రుపయుజ్యం తేస్త్రిరాజ కానాం' స్త్రీ రాజ్యమున నిట్టి స్వబంధు ప్రణయము జ్ఞాతుల మూలమున జరుగునని మహర్షి పలికినాడు. ఈ ప్రకరణమును దారరక్షితమను ఒకే ప్రయోజనము కలిగినది.
98. ఆధునిక వ్యభిచారమునకు కారణములకు : (Encyclopaedia Brittanica vol. XXII (seventh Edn.) page 464.
99. వాత్స్యాయనుడు వర్ణించిన గణికలు పురాతన గ్రీసు దేశములోని Heterai వంటివారు. ఈ మహానుభావుని మతమున వేశ్య కేవలము అర్థప్రయోజన, కృత్రిమ ప్రణయ. పాశ్చాత్య దేశమునందలి పురాతన దేవాలయము దాసీత్వము పణ్యవృత్తిలో నొకజాతిది. "Their prostitute fulfils a social mission; She is the guardian of virginal Modesty, the channel to carry of adulterous desire, the protector of matrons who few late maternity; It is her part to act as the o shield to the female” అన్న ఒక సాంఘిక శాస్త్రవేత్తను బట్టి, ఈ స్త్రీ నిజవృత్తి మూలమున భంగ్యంతరముగా నెట్టి మహోన్నతసేవ స్వజాతి కొనర్చినదో గమనింపదగినది. అందుమూలమున పణ్యవృత్తి ఉండతగినదనిగాని, వలెనని గాని కాదు.
100. Physiology of Sex WALKER -page 144
101. మహర్షి వాత్స్యాయనుడు ఈ అధ్యాయమున ‘దాక్షిణాత్యానాం లింగస్య కర్ణయోరిన వ్యథనం బాలస్య (7.2.19) అను సూత్రమున లింగవేధను గూర్చి చెప్పి ఉన్నాడు. ఇట్టి కథ నేటికిని కొన్ని అనాగరిక జాతులందు కనిపించుచున్నది. లింగవేధ జరిగిన తరువాత అందు లోహ, వాంశిక, కాష్ఠ, అస్థి మొదలైన వానితో నొనర్చిన పుడకల నుంతురు. డైక్ జాతివారును, మరికొందరును ఉపయోగించు నిట్టి వేధ సంబంధమైన అపద్రవ్యములను గురించి రైలీ స్కాట్టు ఇట్లు వ్రాసినాడు. "Analagous methods are in use among other native race, such as metal rings in which feathers are inserted collars made of bristles for fastering round the conna glands etc. In some tribes small sharp stones or bits of metal are inserted under the skin of the glouds" అని. ఇండోనీషియనులలోను, ఉత్తర సెలచీ జాతులలోను నేటికి ఇట్టి ఆచారమున్నదట! చైనాజాతివారు అపద్రవ్యముగ ఈకలను చుట్టి వెండిపూత పోసిన గొట్టము నుపయోగింతురుట. నేటి ఐరోపా, దక్షిణ అమెరికా, తూర్పు ఇండియా దీవులందు వేశ్యవాటికలలో ఉపయోగార్థము ____________________________________________________________________________________________________
సంస్కృతి
179