పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ధీర, అధీర, ధీరాధీర. ప్రతి జాతీయందును జ్యేష్టా కనిష్ఠలు విభేదములు.

పరకీయ: గుప్త, విదగ్ధ, లక్షిత, కులట, అనుశయన, ముదిత, కన్యక గుప్త:12) వస్తు సురత గోపన వర్తీయమాణ సురతగోపన (వర్తమాన సురతగోపన). వాగ్విదగ్ధ క్రియా విదగ్ధ అని విదగ్ధ ద్వివిధము. సామాన్య : అన్య సంభోగ దుఃఖిత, వక్రోక్తి గర్విత ప్రేమ గర్విత, (సౌందర్య గర్విత), మానవతి (పరస్త్రీ, దర్శనాధి జన్మ, గోత్ర స్కలనాధి జన్మ, అపరాంగనాసంగాధి జన్మ) ఇది కామశాస్త్రముల నాయికా స్థూలస్వరూపము.

33. భారతీయ శాస్త్రవేత్తలు స్యందనము (Antorgastic Secretion) నకు విసృష్టి (Orgastic emission) కి విభేదమును చూపినారు. ఇది పూర్వాచార్యులు ఒనర్చిన విధానము. తదుపరి కొక్కోక కల్యాణమల్ల మల్లులు ఇట్టి విభేదము పాటింపక కామసలిల శబ్దమును రెంటికిని సమముగ వాడినారు. భావ శబ్దమునకు రస, రతి, ప్రీతి, రాగ, వేగ, సమాప్తి మొదలగు పర్యాయపదములు కామసూత్రముల (11.1.65) కనుపించుచున్నవి. కామసమయముననున్న గ్రంథమును గూర్చి ప్రాచీనులొనర్చిన ప్రశంసతో నేటి విజ్ఞానులంగీకరింపరు. Encyclopaedia of Sex Practice pp. 244-45 కొందరు కామసలిలామోదమునే దైహికామోదమని భావించినారు. స్మరదీపిక, రతిమంజరులు ఈ కోటిలోనివి. ఈ సందర్భమున స్త్రీ, పురుష జాతి దైహిక గంధ తత్త్వమును గూర్చి విపుల విజ్ఞానమునకు టాలమీ 'ప్రణయము' అను గ్రంథము చూడనగును. (Love Talmey p. 98.)

34. Encyclopaedia of Sex Practice p. 231. Love 81, Ananga Ranga Tridibnath Ray pp 27-31. పాశ్చాత్యులందున స్త్రీ పురుష విసృష్టి విషయమున జీద్భాలకే, బాభ్రవ్య వాత్స్యాయనాదులు పోలిన మతభేదము లున్నవి.

35. Modern Marraige - Griffith. page 91

36. Studies in the Psychology of Sex - Havalock Ellis Vol. IV - p. 550

37. Clifford white - p. 156

38. Art of Love in the Orient - N.K. Basu pp. 202-204

39. Ananga Ranga - T. Ray page 30 Art of Love in the orient pp. 202-205 Physiology of Sex KENNETH WALKER - page 55,

40. Talmey - LOVE (Eugenics Publication Inc. New Yark - page 90.)

41. ఇట్టి ప్రేమకు పాశ్చాత్య కామతత్వవేత్తలు FELLATIO అని పేరు పెట్టినారు. దీనికి మనవారు ఔపరిష్టక రతి యనినారు. అంతఃపురికా ప్రకరణమున దీనిని గూర్చి విపులముగ చర్చయున్నది. స్త్రీల ఔపరిష్టకాది రతులను గూర్చి ఎల్లిస్ ____________________________________________________________________________________________________

సంస్కృతి

165