పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గౌరవర్ణ వామన, శశప్రియ, ఉన్నత కర్షభాక్కు - అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నవారు సంకీర్ణలు మధ్యమలు. వీరికి అవస్థా పంచకములున్నవని ఇతరులు పేర్కొనినారు. అవి కన్యావస్థ, రోహిణ్యావస్థ, గౌర్యవస్థ, బాలావస్థ, తరుణ్యావస్థ, వృద్ధావస్థ. నాయికా నాయకులు సమానావస్థలు గల వారుగ నుండవలెనని కామజ్ఞుల మతము. సత్వభేదముల ననుసరించి స్త్రీలు (1) దేవసత్త్వ (2) నరసత్త్వ (3) నాగసత్త్వ (4) యక్షసత్త్వ (5) గంధర్వ సత్త్వ (6) పైశాచసత్త్వ (7) కాకసత్త్వ (8) కపిసత్త్వ (9) రక్షసత్త్వ (10) దానవసత్త్వ (11) గజసత్త్వ అని విభేదములున్నవి. అభిసారిక, ఖండిత, విరహోత్కంఠిత, వాసవసజ్జికాది శృంగార నాయికా విభేదములు అలంకార శాస్త్రము లందు గోచరించుచున్నవి. చరక శుశ్రుతాదుల వైద్య గ్రంథ విజ్ఞానముతో కొందరు శాస్త్రకారులు స్త్రీలను ప్రకృతి ననుసరించి వాత పిత్త కఫ ప్రకృతులని విభజించినారు. (శుశ్రుతము III. IV. - 62 - 63; ఈ సందర్భమున (శుశ్రుతము iii 72-76 63-71 చూడదగినవి), ఈ విభాగము పాశ్చాత్య వైద్యపిత యని చెప్పదగిన హిప్పోక్రేటిస్ విభజన వంటిది. బాల తరుణీ ప్రౌఢ వృద్ధాది విభాగమునకు ముఖ్యులు పంచసాయకకర్త జ్యోతీశ్వరాచార్యులు, స్మరదీపికకర్త ముఖ్యులు. బాల 16 వత్సరముల వరకు. 12వ వత్సరమున పుష్పవతి అయినను నాలుగు వత్సరముల తరువాత గాని గర్భాధానము జరుగరాదని కామశాస్త్రజ్ఞుల అభిప్రాయము. తరుణి 16-30. (20-30 అని జ్యోతీశ్వరాచార్యుడు) ప్రౌఢ వయస్సు స్మరదీపిక మతమున 19-50. వృద్ధ కొందరి మతమున 50 తరువాత, మరికొందరి మతమున 55 తరువాత. (నాగరసర్వస్వాదులు) గ్రీష్మ వసంతముల బాలతోను, హేమంత శిశిరముల తరుణితోను, వర్షమునను తదుపరి ప్రౌఢతోను ఆనందము నిచ్చునని పద్మశ్రీ పలికినాడు. రతిరత్న ప్రదీపికయందును, రతిరహస్యమునందును గల ఘనులే అనంగరంగ కర్త చెప్పిన దృఢలు. గుణపతాకుని విభాగము శాస్త్రీయముగ లేదు. నీలవర్ణలయిన సంతాల్ పర్గణాలలోని స్త్రీలు (దక్షిణ భారతము) ఘనులుగాని వారియందు శ్లథత (Flaccid Nature) ఉన్నది. మొరటువారు, ఉన్నత కర్షభాక్తత్వము వారిలో లేదు. శుశ్రుతాచార్యులవారు సత్త్వము ననుసరించి పురుషులను (1) సాత్త్విక (2) రాజసిక (3) తామసికు లని చెప్పినారు. వారిలో సాత్త్వికులు (6) మహేంద్రకాయ, వరుణకాయ, యమకాయ, కుబేరకాయ, గంధర్వకాయ, ఋషికాయలు. దేవ, గంధర్వ, యక్ష, మనుష్య, సత్త్వస్త్రీలు సాత్త్వికలు. రాజసికులు: అసురసత్త్వ, సర్పసత్త్వ, శకునసత్త్వ, రాక్షస, పిశాచ, ప్రేతసత్తులు. పిశాచ నాగ, కాక సత్త్వస్త్రీలు రాజసికలు. తామసికులు : నాయిక (3) స్వీయ, పరకీయ, సామాన్య. స్వీయ (3) ముగ్ధ, మధ్య, ప్రగల్భ ముగ్ధ (2) అజ్ఞాతయౌవన, జ్ఞాత యౌవన - నవోఢ, విస్రబ్ధనవోఢ, అతివిస్రబ్ధనవోడ. మధ్య ____________________________________________________________________________________________________

164

వావిలాల సోమయాజులు సాహిత్యం-4