విసృష్టి త్వరితముగ కలుగకుండుటకు వాత్స్యాయన కొక్కోకులు బుద్ధిని బహుధా ప్రసరింపజేయుట అవసరమనినారు. ఇందలి సుభగంకరణాద్యధ్యాయమున వేశ్యావివాహ స్వరూపమును విశదీకరించినాడు. (7.1.13-23) రంగోప జీవులైనవారు నృత్యగీతాదులందు తోడ్పడువారికే కన్యక నీయవలయునని నియమించి ప్రాచీన భారత కళాకర్మ రక్షణకు మహర్షి శాస్తయైనాడు. ఇందలి నష్టరాగ ప్రత్యానయినాద్యధ్యాయమున లింగవేదన గూర్చిన సూత్రము గమనింపదగినది. (7.1.15) బహుపాదపాది మూలములను నూరి పిల్లనగ్రోవికి పట్టించిన తరువాత వాయించినచో నా ధ్వనికి స్త్రీలు వశ్యులగుదురనుట నమ్మతగినదేనా? ఇతర శాస్త్ర గ్రంథములందున్న వశీకరణాదిక మంత్రములు వాత్స్యాయనమునలేవు.
మహర్షి వాత్స్యాయనుడు కేవలము నాయికా నాయక కామమును వర్ణించినాడు
గాని పాశ్చాత్య లోకముల విరివిగను, ప్రాచ్యలోకముల కొలదిగను పొడకట్టు
కామోన్మాదములైన అసహజ ప్రణయములను (Abnormalities) స్పృశింపలేదు.
కొన్నితావుల స్వీయజాతి ప్రణయము Uni sexual love నుద్ఘాటించినను విశేషముగ
నందు పుంభావరూపత అనుగుణ్యమున్నది.” ఇందలి Tribadism, Gyandry
(పోటారతము) మొదలగు గుణములచ్చటచ్చట పొడకట్టక పోలేదు. పశుపక్షిప్రణయము
(Zoo Philia or Beastiality) మందునకైన లేదు. కాని ప్రాచీన దేవాలయ శిల్పముల
వీని విభేదములు క్వచిత్తుగ కాననగును. (Podophilia) బాల ప్రణయము
మచ్చునకైనలేదు. (Sodomy) కనుపింపదు. అష్టవిధ వివాహములలోగాని అన్యత్రగాని
దూషణము (Rape) కొన్ని జాతులవలె నెట్టిహీనులకైన వివాహవిధానముగ నా
మహానుభావుడు పరిగణింపలేదు. వీనినిబట్టి మహర్షి దృక్పథము కామతంత్రమును
జాత్యభ్యుదయమున కనుగుణముగ నిబద్ధించుటగాని అన్యముకాదు. ఈ మహాశాస్త్ర
గ్రంథరచనము మూలమున మహర్షి భారతదేశమునకు నాటి సాంఘిక వ్యవస్థను
గ్రహించుట కత్యుత్తమాధార గ్రంథమును సృజించి మహోపకార మొనర్చినాడు. ఈ శాస్త్ర
గ్రంథము వలన నా నాటి సాంఘిక నాగరికత, జీవన విధానము, వర్ణ వ్యవస్థ,
విద్యావైదు ష్యములు, క్రీడాదికములు, దేశసౌభాగ్య సంపదలు విస్పష్టముగ
వెల్లుచున్నవి.
ఒకానొక ఆధునిక జాతిశాస్త్రజ్ఞుడు గ్రంథాంతరమున ఫలశ్రుతిగ “The
Question of sex - with the racial questions that rest on it - stands before the
coming generations as the chief problem for solution. Sex lies at the root of
life, and we can never learn to reverence life until we know how to understand
160
వావిలాల సోమయాజులు సాహిత్యం-4