ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మిశ్రరచనామార్గనూత్నతలకు వేడుక పడినది. ఇందుఁబురాత నాధునాతన భావుకుల రచనా స్వీకారమునఁ బ్రకరణానుకూలముగ నేనొనర్చిన చేర్పు కూర్పులకు, మార్పులకు విజ్ఞులు మన్నించెదరుగాక!
నిద్రాళువునై యున్న నన్ను మేల్కొల్పి యిట్టి రచనలకుఁ
బురికొల్పి నాచే నీ మణిప్రవాళమును బ్రకటింపఁజేయుటకు
బహురీతుల దోహద మొసఁగిన గురువర్యులకు, నాప్తమిత్రులకు నా
ప్రణామములు, నమోవాకములు!!
హిందూ కళాశాల
గుంటూరు
వావిలాల సోమయాజులు
ఆంధ్రభాషా పండితుఁడు
16