పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురించి చెప్పిన వాక్యములన్నియును సత్యములని వాత్స్యాయనుడు భంగ్యంతరముగ నిరూపించినట్లు వ్యక్తమగును. ఇందలి జ్యేష్టావృత్త ప్రకరణమున "జాడ్య ద్సౌశీల్య దౌర్భాగ్యే భ్యః ప్రజానుత్పత్తే రాఖీక్ష్యేన దారికోత్పత్తే నాయక చాపలాద్వా సపత్యధిక వేదనమ్' (4.2.1) అను సూత్రమున బహుభార్యాత్వ కారణముల జెప్పినాడు. సపత్నిక భార్యాలక్షణములు చెప్పిన తరువాత పునర్భువును పేర్కొని ఆమెకు ప్రథమ గౌరవము లేదనియును, అందలి అక్షతయోని (అగర్భాదాన క్షతయోని (గర్భాధాన) అనుభేదములున్నవనియును చెప్పినాడు. ఇటు పునర్భూ నిర్వచనమున గోనర్దీయ, బాభ్రవ్య మతభేదములు నిరూపితములైనవి. బాభ్రవ్యుని పునర్భువు పునర్భువు కాదని కామసూత్ర వ్యాఖ్యాత 'యాతు పునః పున్నిష్కా మత్ససౌవేశ్యా విశేషే అంతర్భూతా’ అని కొట్టివేసి వేశ్యావిశేషముగ పరిగణించినాడు. పునర్భూప్రకరణమున కొన్ని సూత్రములలో (996-1002) ఆమెకు వేశ్యకంటే ఉన్నత స్థానము నిచ్చినను ఉపపత్ని (Secondary Wife) గ మహర్షి పరిగణించినాడు. దుర్భగా ప్రకరణమున సపత్నీ బాధనొందు స్త్రీ తప్పించుకొని నాయకానురాగమును పొందురీతిని అతడు విశదీకరించినాడు. అంతఃపురికా ప్రకరణమున అంతఃపుర స్త్రీల విషయమున రాజును, జానపదులను భార్య లే రీతి వశమొనర్చుకొన వలయునో చెప్పినాడు. భార్యాధికరణ ఫలశ్రుతిగ మహర్షి పలిత “యువతిశ్చ జితక్రోధా యథా శాస్త్ర ప్రవర్తినీ హోతి వశ్యం భక్తారం సపత్నీ శ్చాధితిష్ఠతి' అనుమాట సత్యముగ విజ్ఞానప్రదముగ నీ యధికరణమును ఆయన చేకూర్చినాడు.


వేశ్యవల్ల కేవలము కామము మాత్రమే లభించి పరదారల వలన అర్థకామములు లభించుటచే వైశికము కంటే పారదారికాధికరణమును తదుపరి మున్ముందుగ మహర్షి పలికినాడు. అందును ముందు స్త్రీ పురుష శీలావస్థాపన మొనర్చి భారతీయుల పావిత్య్రలక్షణములను ద్యోతకమొనర్చినాడు.పరదారల పొందవలసిన నాయకునకును, నాయకుని పొందగోరు పరదారకును పరస్పరము స్త్రీ పురుష శీలావస్థాపన శక్తులత్యవసర మగుటయే ఈ అధ్యాయమును చెప్పుటకు మూల కారణము. ఇందు మదనావస్థ ఉత్పత్తి మొదలు ప్రాణాంతము వరకు పదిదశలని ప్రాచీనమతమును పేర్కొనినాడు. (5.1.5) స్త్రీలు సర్వసాధారణముగ వ్యావర్తనమును పొందుటకు గల కారణములను చెప్పి (5.1.17.42) స్థాలీపులాక న్యాయమున చెప్పినానుగాని ఇంకను నిట్టి వనేకములున్న వనినాడు. పరదారలయెడ సంసిద్ధతగల పురుషుల నెన్ని, తదుపరి కామసూత్ర కర్త అభియోగ విధానములను, పరిచయ కారణములను, బాహాభ్యంతర పరిచయ లక్షణములను చెప్పినాడు. భావపరీక్షా


సంస్కృతి

157