ఆచార్యులు నిషేధించిరి. ఔపరిష్టకము నే స్త్రీ కొనర్తురో దానితో కొన్ని దేశములవారు సంగమింపరని చెప్పినాడు. ఇందలి పురుషకృత్యమును (Cunnilinctus) గూర్చి కొలదిగనే ప్రసంగించినాడు. (1.6.31.33) పురుషులలో విస్తారరూపమున నీ ముఖచుంబనము (Buccal Congress) కనుపించిన దానిని గూడ పైరీతి నిమిత పార్శ్వ దష్టాదులవలె గ్రహింపవలెనని ఆయన అభిప్రాయము. ఇట్టివాని జోలికి విద్వాంసులు ఉత్తములు పోరాదని వైద్యశాస్త్రములోని రస వీర్య విపాకాది భక్షణ సామ్యమున నొక శాస్త్రార్థ మొనర్చినాడు. 'అర్థ స్వాస్య రహస్యత్వా చల త్వాన్మన సప్తధా. కః కదా కిం కుతః కుర్యాదితి కో జ్ఞాతు మర్హతి' అని దీని అనిశ్చయ స్వరూపమును వెల్లడించినాడు. (2.9.41) 76
అటుపిమ్మట వచ్చిన రతారంభావసానికాదధ్యాయమున సురతారంభ
సురతావసానముల నొనర్పవలసిన కృత్యములను చెప్పినాడు. నృత్తవారిత్రాది గోష్ఠులు,
ఆపాదకములు, ఖాద్యములు, మొదలగునవి భావ వృద్ధకములు ప్రవృత్తములైనవి.
ఇట రతి విభేదముల గూర్చి 'రాగవ దాహార్యరాగం కృత్రిమరాగం వ్యవహితరాగం
పోటూరతం ఖలరత మయంత్రిత మితి రతివిశేషాః' అని మహర్షి సూత్రీకరించినాడు.
గోత్రస్ఖలనమును గూర్చి జాగరూకత వలసినది హెచ్చరించి ప్రణయ కలహ విధానముల
జెప్పి చతుష్షష్టి మిగిలిన వాని కంటె శ్రేష్ఠము "విద్వద్భిః పూజితాం మేతాం ఖలైరపి
సుపూజితాం, పూజితాం గణికా సంఘై ర్నందినీం కోనపూజయేత్" (2.9.51) అను
శ్లోకమొనర్చి సాంప్రయోగికమును ముగించినాడు.
కన్యా సంప్రయుక్తకము తరువాత వచ్చు నధికరణము, చతుష్షష్టి కళావిచక్షణుడు,
భావతః సంవక్ష్యమాణుడు అయిన నాయకునికి సమాగమోపాయమును అవాపము
కావలయును. అందు కన్యక ముఖ్యురాలు గనుక నీ యధికరణమున
ప్రథమాధ్యాయము వరణ విధానము. ఇందలి "సువర్ణాయాం అనన్యపూర్వాయం,
శాస్త్రాధిగతాయాం, ధర్మార్థక పుత్రాః, సంబంధః పక్షవృద్ధిః అనుపసత్కృతారతిశ్చ”
అను సూత్రము ముఖ్యముగ గమనింపదగినది. సవర్ణయు, అనన్య పూర్వయు, అయిన
నాయిక వలన ధర్మము, అర్ధము, పుత్రులు, సంబంధము, పక్షవృద్ధి, అకృత్రిమ రతి
లభించునని ఆయన అభిప్రాయము. (3.1.1) ఈ భావము నేటి పాశ్చాత్యుల
వివాహవిజయమునకు సంబంధించిన అభిప్రాయముతో కొంత వ్యతిరేకించు చున్నది. "
భారతదేశమున వివాహము కాని వారు ఎవరును ఉండకూడదని ఋషుల
అనుశాసనము. రూపాజీవయైన పణ్యస్త్రీయును కుమార్తె నెవరికైన నిచ్చి వివాహమొనర్చి
154
వావిలాల సోమయాజులు సాహిత్యం-4