పురుషుం డభిముఖంబుగ పవ్వళించి పట్టునవి తిర్యక్కరణంబులు. అంగనామణి కూర్చున్నప్పుడు పురుషుండు పైకొనిపట్టు కరణంబులు స్థితకరణంబులు. మగువ నిలుచున్నప్పుడు, స్తంభకుడ్యాదులానిగా నుంచి పురుషుడు పట్టుబంధంబు లుబ్ధిత కరణంబులు. కోమలాంగి కరంబులు పాదంబులు పాన్పుననాని తిర్యగ్జంతువుల రీతి వ్రాలిన పురుషుండు వెనుకగ నిలచి పట్టు బంధంబులు వ్యాపకరణంబులు. ఇవి ఐదును పురుష కృత్యములు. ఇక పురుషుడు రతిశ్రాంతుడై పవళింప తనివినొందక పురుషుని పైకొని లతాంగి పట్టునవి విపరీత కరణంబులు నన జను" అని.
కల్యాణమల్లుడు కూర్మ, పరివర్తిత, ఉపపాద, పద్మాసన, కర్కాటక, ఫణిపాశ,
సంయమన బంధములను స్థితకరణములలోను (Sedentary attitudes), వీణక
బంధకమును తిర్యక్కరణములోను (Lateral Group) చెప్పి ఉన్నాడు. ఇది వాత్స్యాయనాది
ప్రాచీనాచార్యుల మార్గమునకు భిన్నమైనది.
'ఉత్ఫులకం విజృంభితకం ఇంద్రాణికం చేతి త్రితయం మృగ్యాః ప్రాయేణ’
(2.6.7) ‘ఏకోన నీచతర రతేః సంపుటకం పీడితకం వేష్టితకం బాడబక మితి హస్తిన్యాః
(2.6.14) అని మృగీ, హస్తినుల బంధవిభేదములను మహర్షి నిరూపించినాడు. ఉత్తాన
కరణములలోని సమపాదము స్మరదీపిక, రతిమంజరీ, ప్రభృతి గ్రంథములలో కాకపాద,
కామప్రద, నాగపాద, కామమర్దన ఇత్యాది నామవిభేదములతో పొడకట్టుచున్నది.
వాత్స్యాయనుని జృంభితకమును రతిరహస్య కర్త స్వీకరించినాడు. పంచసాయకాదులు
కల్యాణమల్లుని సమపాదమును గ్రహించినవి. స్మరదీపికలోని సమపాదమునకును,
అనంగరంగములోని సమపాదమునకును కొంత విభేదము కనిపించుచున్నది. 'తరుణి
తన పాదయుగళము, హరియూరువు లందు నిల్పియట బవళింపన్, యురమురము
జేర్చి పైకొన, పరువడి సమపాద నామబంధం బయ్యెన్' అని నందికేశ్వర
మతానుసారముగ శివరామకవి సమపాదమును చెప్పినాడు. నాయిక పాదము
నొకదానిని పాన్పుపై జాపిన ఈ బంధమే సరితమగునని కొక్కోకుని మతము.
గ్రామ్యబంధమే సౌమ్య బంధము. శివరామకవి దీనిని గుర్తించినట్లు లేదు. కామసూత్ర
కారుని శూలచితమునే నాగర సర్వస్వము ఆయత మనినది. 'ఏకశ్శిరసి ఉపరిగచ్ఛే
ద్వితీయః ప్రసారిత ఇతి శూలచిత' అని మహర్షి శూలచితమును చెప్పినాడు (2.6.26).
రతిరత్న ప్రదీపిక కర్త వ్యాఖ్యాత ననుసరించి దీనిని శూలాంకమని నాడు. రతిరహస్య
వ్యాఖ్యాత మల్లినాథుడును, కొక్కోకుడును దీనిని త్రివిక్రమమనినారు. వాత్స్యాయన,
కొక్కోకు లిరువురును వ్యోమపాదమును పేర్కొనలేదు. ఇది పంచసాయక కామ
సంస్కృతి
143