నివి ఆ జాతి కనుభవైక వేద్యములైనవి కావని పండితుల అభిప్రాయము. రోమక సామ్రాజ్య వైభవమునాడు పశ్చిమ భారతమునుండి కొందరు సామాన్య వేశ్యలు వెళ్ళినారుగాని వారి వెంట నీ భారత రతిబంధ భేదములు అచటికి వెళ్ళినట్లు కనుపింపవు. అరబ్బు దేశ కామశాస్త్ర వేత్తలు ముప్పది రెంటిని మించి సంవేశన విధానము లెరిగినట్లు లేదు. ఫోర్బెర్గు అను ఒకానొక ఆధునిక సాంఘిక శాస్త్రవేత్త (Sociologist) ప్రపంచములోని అనేక కామకళా గ్రంథము లను అవలోకన మొనర్చి తొంబది రతిబంధ భేదములను గుర్తించినట్లు తెలియుచున్నది. పారిస్ నగరమున ముద్రితములైన కొన్ని అశాస్త్రీయ గ్రంథములలో 101 రతివిభేదములున్నవట! శారీరకముగ సమమైనవియును, దంపతులు అన్యోన్యానురాగమును చూరగొన నవకాశము కల్పించునవియును అయిన సంవేశన విధానములు 12కు మించిలేవని పాశ్చాత్య శాస్త్రజ్ఞుల అభిప్రాయము. 'మేహన ధర్మములు' (Genital Laws) గ్రంథకర్త 10 మాత్రమంగీకరించినాడు. ఆదర్శ వివాహ గ్రంథకర్తయును బంధదశకమును స్వీకరించినాడు. దంపతులు వైవిధ్యానుభూతికి, వ్యక్తిగతలోపపూరణములకును నివిచాలునని ఆయన అభిప్రాయము. మిగిలిన వానిని కామకళలోని మల్లబంధ విశేషములని త్రోసిపారవేసినాడు. సుప్రసిద్ధ స్త్రీ పురుష మానసిక శాస్త్రవేత్త (Sex - Psychologist) ఎల్లిస్ 48 బంధవిభేదముల నంగీకరించినాడు.
వాత్స్యాయనుడు నిరూపించిన నలుబది ఆరు రతిబంధ భేదములలో తరువాతి
శాస్త్రజ్ఞులు కొన్నిటిని మాత్రమే స్వీకరించిరి. అనంగరంగకర్త 35 గ్రహించెను. కొన్ని
సందర్భములందు నామ వ్యత్యయములు, లక్షణ వ్యత్యయములు కనుపించుచున్నవి.
భారతదేశ మున జన్మించిన కామశాస్త్ర వేత్తలలో మహర్షిని అనుసరించినవారు కొందరు;
పూర్వాచార్యుడైన గోణికాపుత్రుననుసరించినవారు కొందరు. మొత్తము మీద
సంవేశనములు 48గ పరిగణితములగుచున్నవి. అందువలన వీనికి 'చౌశీతి' అను
నామము రూఢమైనది.
బంధభేద స్వరూపములను నెల్లూరు శివ రామకవి కామకళానిధిలో నిట్లు
ఎరిగించినాడు. "ఆ బంధములకు ఉత్తాన కరణములు (SUPINEATTITUDES),
తిర్యక్కరణంబులు (Lateral), స్థితీకరణంబులు, నుతిత కరణంబులు,
వ్యాపకరణంబులు నన నైదు విధంబులు. నారీరత్నంబు పల్యంకి కాంకతలమున
పన్నుండినపుడు తత్పాదంబులు, కరంబులు పట్టి పట్టెడి బంధంబు లుత్తాన
కరణంబులు, పువుబోడి ప్రక్కవాటుగ నైన ప్రక్కగ నైన కుడిప్రక్కగనైన పవ్వళించియుండ
142
వావిలాల సోమయాజులు సాహిత్యం-4