Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేతవ' అని హెచ్చరించి ఉన్నాడు. 'గూఢక (Hidden) ముచ్ఛూనక (Swollen) బిందు (Spot) బిందుమాలా (Chain of spots) ప్రవాళమణి (Coral) ప్రవాళ మణిమాలా (Coral chain) ఖండాభ్రకం (Broken cloud) వరాహచర్వితక (Boars) మితి దశనచ్ఛేదన వికల్పాః (2.5.4) అనుసూత్రమున వీటి భేదములను నిరూపించినాడు. ఉచ్ఛూనకమును వాత్స్యాయనుడు లోపలి పెదవిపై ప్రయోగింపనగు నని చెప్పగా అనంగరంగకర్త ఎడమ బుగ్గను దానిస్థానముగ చెప్పినాడు. ప్రవాళమణి రదనక్షతమును కామసూత్రములు అనేక మారులుగ ప్రయోగించి చూపమును పొందవలెనని చెప్పగా అనంగరంగ కర్త కల్యాణమల్లుడు పొరపాటు పడి కఠినముగ కొఱికి ఒక మారే యొనర్పవలెననినాడు. కల్యాణమల్లుడనినట్లు ప్రవాళమణి స్థానము పై పెదవి కాదు. దక్షిణ చుబుకము నందును ప్రయోగింపవచ్చును. మహర్షి అట్టొనర్చిన దానిని మండల రదనచ్ఛదముగ పరిగణించినాడు. “తదుభ మపిచ చండ వేగయోః" (2.5.18) అను సూత్రము ననుసరించి స్త్రీ పురుషులిరువురును వీనిని ప్రయోగింపవలయునని శాస్త్రకారుల మతమైనను విశేషముగ నివి పురుష ప్రవర్తకములుగ ప్రాచ్య దేశములందు కనిపించుచున్నవని పాశ్చాత్య జాతిశాస్త్ర వేత్తల అభిప్రాయము.

రాగోద్దీపక క్రియలలో కచాకర్ష మొకటి. (Hair-Caressing) ఈ కేశగ్రహణము నేటి వరకును పాశ్చాత్యలోకము లెరుగవట! కామసూత్ర రతిరహస్యములందు కచాకర్షణ విధానములు కనిపింపవు. పంచసాయకములోని ఒకానొక ప్రతిలో ఒక విధానమున్నది. మరియొక విధానము నాగరసర్వస్వము నందున్నది.' అనంగరంగమునకు ప్రతిరూపమైన కామప్రబోధమున వీని స్వరూప స్వభావాదులు విశదముగ కనుపించు చున్నవి. ఇట్టి ఉద్దీపన క్రియలలో చేర్చదగిన మరికొన్ని మర్దనములు (Squeezes), గ్రహణములు (Grasps) కనుపించుచున్నవి. ఇవియును పూర్వ గ్రంథములందు లేవు. ఇవి బాహ్యరతులు. కరతాడన విధానముల పురుషులొనర్పదగిన వానిని నాల్గింటిని, స్త్రీ లొనర్పదగిన వానిని నాల్గింటిని అనంగరంగ కర్త పేర్కొనినాడు. పద్మశ్రీ కొన్ని మర్దనములను, గ్రహణములను చెప్పినాడు. ఆది పితకము (Enkindling) స్పృష్టకము (Touching) కంపితకము (Throbbing) సమిక్రమము (Attacking all about) ఇవి మర్దనరీతులు - బద్ధముఖి (Close Grasp) - వేష్టితకము (Twinning) కృతగ్రంథికము (Knotted tightly) సమకృష్టి (Pinching) గ్రహణములు ఔపరిష్టక సీత్కృతములును బాహ్యరతిలోనివే. వీనిని మహర్షి వేరు అధ్యాయముల విశదీకరించెను.


138

వావిలాల సోమయాజులు సాహిత్యం-4