Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విభాగావశ్యతకు స్త్రీ జాతిలోని అహంభావ పూర్వకమైన అర్ధరహితత (Mosochistic tendencies of a sex-conscious women) ప్రాచీనులు గుర్తించుటయే కారణము. కామ ప్రేరణమున చుంబన శక్తిని గమనించుటయును మరియొక కారణము. ఆ శక్తిని గూర్చి ఆధునిక వివాహ కర్త గ్రిఫ్ఫెత్తు అన్న మాటలు సమంజసములు ఈ వాక్యములకు మహర్షి అంగీకారమును నున్నది. గ్రిఫ్ఫెత్తు మహాశయుడు "నేటి ఆధునిక స్త్రీ చుంబన క్రియ పురుషకర్మయని భావించుట కానవచ్చుచున్నది. అది పొరబాటు. అతడెట్లు చుంబించినచో ఆమెయునట్లు చుంబింపవలెనని” ఈ నాడు పాశ్చాత్య దేశములకు చెప్పవలసి వచ్చినది. " మహర్షి రెండువేల వత్సరములకు మున్నే "కృతే ప్రతికృతం కుర్యా త్తాడితే ప్రతితాడితం, కరణేనచ తేనైవ చుంబితే ప్రతిచుంబితమ్” అని స్త్రీ లోకమునకు శాసనమొనర్చినాడు. (2.3.34)


స్మరదీపిక నాగర సర్వస్వాది కామగ్రంథములందు చూషణము (Sucking) అను మరియొక సంప్రయోగాంగము (Form of Love Play) కనుపించు చున్నది. పద్మశ్రీ ఇందలి - ఓష్ఠ విమృష్టకము, చుంబితకము, అర్ధ చుంబితకము, సంపుటకము - అని నాలుగు విభేదములను చెప్పినాడు. ఇవి వాత్స్యాయనుని చూషణ చుంబన విభాగములేగాని అన్యములు కావు.


తదుపరి కామసూత్రకర్త నఖాదానమును గురించి ప్రసంగించినాడు. ఉపయోగింపవలసిన సమయములను "తస్య ప్రథమసమాగమే ప్రవాస ప్రత్యాగమనే క్రుద్ధ ప్రసన్నాయాం మత్తాయాం చ ప్రయోగో ననిత్య మచండ వేగయోః" (2.4.2) అను సూత్రమున విశదీకరించినాడు. రాగోద్దీపన యైన తదుపరి స్థాన మస్థానమనిగాని సమయములని గాని నిబంధనలు లేనట్లు సువర్ణనాభుడు (2.4.6) సూత్రములందు 'కక్షా స్తనౌగళః పృష్ఠం జఘనమూరూచ స్థానాని' (2.4.5) అని స్థాన నిర్దేశమున్నది. స్మరదీపిక కారుడు ఇంత కంటే భిన్న స్థానముల పేర్కొనినాడు. కొక్కోకుడు మాసిక రజోదర్శనానంతర కాలమున కొన్ని దినములు నఖాదాన యోగ్యములని చెప్పినాడు. చండ, మధ్య, వేగల నఖలక్షణము లెట్లుండవలెనో వాత్స్యాయన యశోధరులు వెల్లడి చేసినారు. ఈ సందర్భమున మహారాష్ట్ర దాక్షిణాత్యుల నఖలక్షణములు నిరూపితములైనవి. (2.4,10,11) నవవిధములైన నఖాదాన రీతులు కామసూత్ర కర్త మతమున నేర్పడినవి. (1) ఛురితకము (Clasping of the Nails) (2) అర్ధచంద్రకము (Half Moon) (3) మండలకము (Circle) (4) రేఖా (Vertical Lines) (5) మయూరపాద (Peacock Foot Print) (6) వ్యాఘ్రపాద (Tigers


136

వావిలాల సోమయాజులు సాహిత్యం-4