పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీ పురుషాది విభేదముల ననుసరించి చుంబన వికల్ప ప్రకరణమున స్థానక్రియా రూపాదికములను చక్కగ నిరూపించినాడు. చుంబనాది పంచకములో ముందు వెనుకలు లేవనియును (2.3.4) “సర్వసర్వత్రరాద స్యాన పేక్షితత్వాదితి వాత్స్యాయనః' అనుచోట సమస్త శరీరమును ప్రయోగ యోగ్యస్థానమనియును పలికినాడు (23.3.)


మహర్షి వాత్స్యాయనుడు అతి నిశిత విచక్షణతో చుంబనమును ముగ్ధయగు కన్యక యొనర్చు నిమిత్తము మొదలు ప్రౌఢ యగు నాయిక యొనర్చు జిహ్వాయుద్ధము వరకును పరిశోధించి విభజించినాడు. చుంబన యోగ్య స్థానముల విషయమున కామసూత్రములకును, రతిమంజరికిని విశేష విభేదము కనుపించుచున్నది. రతిమంజరీకర్త యోనిని చుంబన యోగ్య స్థానముగ నిరూపింప మహర్షి దానిని ఊరుసంధిగనే పలికినాడు. 4 తొడలు, క్రీగడుపుపై నొనర్చు చుంబనమునకు నాగరసర్వస్వకర్త పద్మశ్రీ సంహతోష్టము అని నామకరణమొనర్చెను. పాశ్చాత్యుల ‘Brush and Bloom' అను చుంబనమును వాత్స్యాయనుడు నమితమని వ్యవహరించి నూతన వధూపరము గావించినాడు. కామసూత్రములలోని ఉద్ఘాంతమును రతి రహస్యకారుడు ఉద్ఘాంతక మనినాడు. దీనిని నాగరసర్వస్వము భ్రమిత మనియును, అనంగరంగము తిర్యక్కనియును వ్యవహరించినవి. కామ గ్రంథముల 'ప్రతిబోధ' మను పేరనున్న చుంబన విధానము చుంబన విధానము కాజాలదని నేటివేత్తల అభిప్రాయము. వాత్స్యాయనుని సూత్రములు కనిపించిన (1) సూచి, (2) ప్రతత (3) కరి అను చుంబన విభేదములను పద్మశ్రీ నిరూపించినాడు. కామసూత్రములందున్న చుంబన ప్రతిచుంబన విధానముల కాలస్థలజాతి విభేదములను పరిశీలించినచో ప్రాచీన భారతీయుల కామకళ ఎట్టి ఉచ్చస్థితి నొందినదో తేటపడగలదు. వాత్స్యాయన మతమున చుంబనములు 13. (1) నిమిత్తకము (Perfunctory kiss) (2) స్ఫురితము (Tremoulous) (3) ఘట్టితకము (Driving) (4) సమ (Straight) (5) వక్ర లేక తిర్యక్ (Oblique) (6) ఉాద్భ్రాంతము (Errastic) (7) అవపీడితము (Compressed) (8) శుద్ధావ పీడితము (Soft-Pressed) (9) చూషణము లేక అధరపాన (The sucking or lip drinking) (10) ఆకృష్ట (Drawn-up) (11) ఉత్తర చుంబిత (Concurrent kiss) (12) సంపుటక (Cupping) (13) జిహ్వాయుద్ధ (Tongue tilting). " ఇంతేకాక ప్రాతిబోధ (Awaking kiss) ఆది చుంబన విభేదములును కామసూత్రములందు కనుపించుచున్నవి. కార్డ్స్ ఎబ్బింగు, ఫ్రాయిడ్ మొదలగు ఆధునిక విజ్ఞానులకంటే నెంతో పూర్వము భారత, రోమకదేశ కామకళా శాస్త్రవేత్తలు కామతంత్రమున చుంబన స్థానమును గమనించి తదనుగుణముగ శాస్త్ర రచన చేసియున్నారు. ఇట్టి


సంస్కృతి

135