ఇందు ఆది అగు ఆలింగనము బాహ్యరతి సమయమున - స్పృష్టక, విద్ధక, ఉదష్టక, పీడితములని నాలుగు విధములును, రతి సమయమున వృక్షాధిరూఢ, తిలతండుల, క్షీరనీర, లతావేష్టితములని నాలుగు విధములును (2.2.7-16), ఇందు సంప్రయోగ కాలము లందు లతావేష్టితక, వృక్షా దిరూఢకము కలదు. నాయిక ప్రయోక్తిగ నుండవలెనని యశోధరుని వ్యాఖ్యానము. ఈ ఉభయమునకు వాత్స్యాయనుడు స్థితకర్మ లనినాడు. (22.18) తదుపరి ఏకాంగోపగూహనములుగ ఊరు, జఘన, స్తన, లలాటికాలింగనములను సువర్ణనాభుని మతమును పేర్కొనినాడు. వీనిలో రతి పూర్వరంగమునకు (బాహ్యరతి) సంబంధించిన నాల్గింటిలో స్పృష్టక, ఉద్ఘాట్టక, పీడితకములను వదలి తదుపరి వచ్చిన ఏకాంగోపగూహనములలోని ఊరు, జఘన, లలాటి కాలింగనములను గ్రహించి అనంగరంగాది కామశాస్త్రజ్ఞులు ఆలింగన షష్ఠమును మాత్రమే పేర్కొనినారు. కుట్టనీమత కర్త, దామోదరగుప్తుడు చక్రవాక, హంస, నకుల, పారావతాది ఆలింగన విధానములను పేర్కొనినాడు. కామసూత్రముల లోనే ఆమోద, ముదిత, ప్రేమ, ఆనంద, రుచి, మదన, వినోదాలింగనములను గూర్చి 'పృచ్ఛతాం, శృణుతాం వాపి తథా కథయతా మపి ఉపగూహనవిధిం కృత్నం రిరంసా జాయతేః శృణాం' (2.2.30) అను సూత్రమున ఉక్తి వైచిత్య్రముతో వెల్లడించి మనుజులకు రిరంస (కామేచ్ఛ) కలిగించుటయే వీని ప్రయోజనమని స్పష్టముగ పలికినాడు.
ప్రణయ చుంబనము మానవుని కొకనాడు లభ్యమైన గుణము కాదని ఎల్లిస్
అభిప్రాయము. చుంబనమును ప్రపంచములలోని వివిధ జాతులు వివిధ రూపముల
అనేక భావములకు వెల్లడి యొనర్చుట కుపయోగించు చున్నారు. 'వివాహ గ్రంథకర్త
వాన్ డి వెల్డి చుంబనమున రుచి, స్పర్శ, గంథములున్నవనినాడు. '
అభిప్రాయమున కనుగుణముగ కెన్నెత్ వాకర్ "Kisses provide a fitting prelude
to love, and all the great Eastern works on the subject devote much attention
to the art of kissing, the lover's kiss the tongue often plays the part so that
other special senses contribute their quota to it; Taste and smell are added to
tacitile sensation. In this connection it will be remembered that it was said of
the kisses of POPPAEA that they had about them the favour of wild berries.
It is, however among the Mongolian Races that the olifactory component of
the kisses enters so iargely into courtship. In the kiss of Europeans touch
predominates over smell" (Physiology of sex page 47) వాత్స్యాయన మహర్షి
134
వావిలాల సోమయాజులు సాహిత్యం-4