Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Elephant Woman) అను విభాగము నందికేశ్వర మతము. ఈ మతము ననుసరించిన గ్రంథములలో స్మర దీపిక ప్రథమమున పేర్కొనదగినది. తరువాత కొంత కాలమునకు పుట్టిన శార్గ్ఙధర పద్ధతి, కందర్ప చూడామణులు ఈ మార్గము ననుసరింపక స్త్రీ పురుష జాతుల రెంటిని మేహన ప్రమాణముల ననుసరించి పంచవిభేదములతో పరిగణించిరి. స్త్రీలు : (1) హరిణ (She-Deer) (2) ఛాగి (She-Goat) (3) వాడవము (Mare) (4) కరిణి (She-Elephant) (5) కరభి (She-Camel). పురుషులు: (1) మృగ (Harst) (2) వర్కరము (He-Goat) (3) వృషము (Bull) (4) తురగము (Stallion) (5) రాసభము (Jack-Ass). వీరి మేహన ప్రమాణములు 6, 8, 10 12, 14 అంగుళములని వారి అభిప్రాయము. స్త్రీభగ పరిధి లింగము పొడవును, మేహనము లోతును అనుసరించి ఉండునట. కాని అట్లుండని అవకాశములును కొన్ని సందర్భములందున్నవని కామసూత్ర వ్యాఖ్యాత యశోధరుడు (వ్యాఖ్య సూ.2.1.2) అందు నిరూపించినాడు. దీర్ఘ లింగము పలుచగ నుండవచ్చును. కుబ్జలింగము మందముగ నుండవచ్చును. అట్టి సందర్భముల మొదటి దానికి వాంశిక మనియును (Bamboo Type), రెండవ దానికి ముసలకమనియును (Club-Type) రతిమంజరీ, స్మరదీపికలు నామకరణ మొనర్చినవి.


రతావస్థాపనాధ్యాయమున మహర్షి రతివిభేదములను కేవలము మేహనప్రమాణ వైవిధ్యము ననుసరించి మాత్రమే కాక విసృష్టి, వేగములను బట్టియును నవవిధములని నిర్ణయించుట వలన ఆయన మానసిక నైశిత్యము, శాస్త్ర వైశాల్యము వెల్లడి అగుచున్నవి. మానసికముగ గాని శారీరకముగ గాని మానవజాతి సమము కాదనియును అందు అనంత వైవిధ్యమున్నదనియును మహర్షి గ్రహించినాడనుటకు సందేహము లేదు. అందువలన మహర్షి మతము ననుసరించి 'ప్రమాణకాల భావజానం సంప్రయోగాణా మేరైవేస్య నవవిధత్వా తేషాం వ్యతికరే సురతసంఖ్యా యానశ్యంతే కర్తు మతి బహుత్వాత్' (2.1.35) అను సూత్రమును బట్టి (9 × 9 × 9 = 729) ఏకోనత్రిశతృప్త శతవిభేదములు ఏర్పడినవి. విసృష్టికి ఉపచారాది క్రియలొనర్ప వలసినదని చెప్పినాడే గాని వాత్స్యాయనుడు వాటి స్వరూపమును నిరూపించలేదు. కొక్కోకుడును వాని పొంత పోలేదు. అనంగరంగ కర్త కరికరక్రీడ (Tittilation) మొదలైనవానిని నిశ్చయించి తన్మూలమున నేర్పడిన నవభేదములను చేర్చినాడు. అందుమూలమున రతివిభేదములు 9 × 9 × 9 × 9 = 6561 విభేదములు ఏర్పడుచున్నవి. పాశ్చాత్యజాతి శాస్త్రవేత్త 243ను మాత్రమే పేర్కొనినాడు. ప్రమాణ (Size) విసృష్టి (Time of Orgasm) వేగము


సంస్కృతి

129