ఈ శ్లోకములు చరిత్రజ్ఞులు పరిగణింప తగినవిగా లేవు. లోకమున వాత్స్యాయన శబ్దవాచ్యులైన శాస్త్రకారులు మువ్వురు కనిపించుచున్నారు. (1) అర్థశాస్త్ర కర్త కౌటిల్యా పరనాముడు (2) న్యాయశాస్త్ర భాష్యకారుడు వాత్స్యాయనుడు (3) కామసూత్ర కారుడు వాత్స్యాయనుడు. అర్థశాస్త్ర వ్యాఖ్యాత లెవ్వరును కౌటిల్యుని వాత్స్యాయన శబ్దముతో వ్యవహరింపరు. అదే రీతి న్యాయశాస్త్ర వ్యాఖ్యాతలు కౌటిల్య శబ్దము న్యాయశాస్త్ర వ్యాఖ్యాతకు వాడుక చేయలేదు. లోకము నందున్న ఉపశ్రుతి ననుసరించి కొందరు విద్వాంసులు వాత్స్యాయన శబ్దము బిరుదనామ మనియు, అతడు మల్లనాగుడనియును అభిప్రాయపడుచున్నారు. మరికొందరు కామసూత్రకర్తను 'వాత్స్యాయన మల్లనాగు' డనుచున్నారు.
వాత్స్యాయనుని కాలనిర్ణయ మొనర్చుటకు ప్రబలములైన ఆధారము లెవ్వియును
లేవు. పండితులు నానారీతుల అభిప్రాయములను వెల్లడించినారు. 1. కామ
సూత్రములను ప్రప్రథమమున ప్రచురించిన కలకత్తా విద్వాంసుడు మహేశ చంద్రభట్టు
“ద్వివేదాక్షి” అను ఒక శ్లోకభాగమున సూత్రకారుడు 1424 ను సూచించినాడనియును,
అందువలన ఇతడు క్రీ.శ. 677 నాటివాడని నిశ్చయించినాడు 2. సంస్కృత వాఙ్మయ
చరిత్రకారుడు కృష్ణమాచార్యులవారు 'కామ సూత్రము' లందు కుంతలస్వాతికర్ణి అను
ఆంధ్ర శాతవాహనరాజు ప్రశంస ఉండుట వలన ఇతడు క్రీ.శ. 3, 4 శతాబ్దుల
వాడని నిశ్చయించిరి. 3. ఇతడు మూడవ శతాబ్ది వాడని ఆచార్య చోరే అభిప్రాయము
4. ఆంధ్ర వాత్స్యాయన కామసూత్ర వ్యాఖ్యాతలు కావ్యస్మృతి తీర్ధశ్రీ పంచాగ్నుల
ఆదినారాయణ శాస్త్రులవారు, ప్రథమ ముద్రణమున ఇతడు పతంజలి
మార్గముననుసరించి చర్చించుటచే, నించుమించు అతనికి సమకాలికుడై క్రీ.శ. 150
ప్రాంతమున జీవించి ఉండవచ్చునని అభిప్రాయపడినారు. " రెండవ ముద్రణమున
ఆచార్య చక్కల్ ధర్ గారి వలె ఇతడు క్రీ.శ. 3వ శతాబ్ది మధ్య భాగమునకు
చెందినవాడనినారు. 5. ఆచార్య చక్కల్ ధర్ మహాశయుడు " వాత్స్యాయనుడు
క్రీ.శ. 3వ శతాబ్ది మధ్యభాగము వాడని కాళిదాస మహాకవి కాలనిర్ణయముననుసరించి,
మరికొన్ని ఇతర ప్రమాణములను బట్టియు నిశ్చయించినారు. ఈ అభిప్రాయముతో
డాక్టర్ బార్నెట్టు మహాశయుడు సంపూర్ణముగ నేకీభవించినాడు. అందువలన
కామసూత్ర కర్త క్రీ.శ. 3వ శతాబ్ది మధ్యభాగము వాడని మనము నిర్బాధకముగ
నిశ్చయింపవచ్చును.
సంస్కృతి
119