లూసిలియస్ : సైన్యాలకు ఆజ్ఞను అందజేయండి ఆగండి.
బ్రూటస్ : కాషియస్ వచ్చేశాడా ఏమిటి?
లూసిలియస్ : చాలా దగ్గరకు వచ్చేశాడు. తమ యజమానికి ప్రత్యా మ్నాయంగా మీకు ప్రణతులర్పించటానికి పిండారస్ వచ్చాడు.
బ్రూటస్ : అతడు వచ్చి క్రమరీతిని ప్రణతులర్పించవచ్చు. పిండారస్! తనలో కలిగిన మార్పువల్లనో, కొందరు దుష్టోద్యోగుల ప్రేరణవల్లనో, కొన్ని అకృత్యాలు చేసి బాధ కలిగించాడు. అయినా, అతడు దగ్గిర ఉంటే తగ్గ సంజాయిషీ తీసుకుండేవాణ్ణి.
పిండారస్ : ఉదాత్తుడైన మా యజమాని స్వతస్సిద్ధమైన ఆయన సుగుణానికి అనుగుణంగానే మహోద్దేశాలు పెట్టుకొని ప్రవర్తించినట్లే కనిపిస్తున్నారు.
బ్రూటస్ : ఆ విషయంలో అతని యెడ ఎవరికీ సంశయం లేదు. లూసిలియస్! అతడు నన్ను ఎలా ఆహ్వానించాడో నివేదించు.
లూసిలియస్ : తగిన కృతజ్ఞతాగౌరవాలతో ఆహ్వానించాడు గాని, పూర్వం ఆయన చూపించే అతి పరిచయాన్ని గానీ, మిత్రభావాన్ని గానీ ప్రదర్శించలేదు.
బ్రూటస్ : ఈ నీ వర్ణనను బట్టి అనురాగ పూర్వకమైన మైత్రి అతడిలో చల్లారిపోతున్నట్లు అర్థమౌతున్నది. లూసిలియస్! గమనించు. ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోవటం ప్రారంభిస్తుందో అప్పుడు అది కృత్రిమరూపాన్ని ధరిస్తుంది. స్వచ్ఛమైన మైత్రికి అటువంటి కృత్రిమత్వం అనేది ఉండనే ఉండదు. చేయివేసి ఉంచినంతవరకూ తమ ప్రతిభా విశేషాలను ప్రకటించుకోటం కోసం అశ్వాల్లా అత్యుత్సాహాన్ని ప్రకటిస్తారు. పరీక్షకు నిలవవలసినప్పుడు బోర ముంగిల పారేసి మొండి తట్టులా క్రుంగిపోతారు. కాషియస్ సైన్యంతోటే వస్తున్నాడా?
లూసిలియస్ : ఈ రాత్రికి సార్డిన్35 లో బస చేద్దామన్నాడు. ఆశ్విక సైన్యంలో అధికారం ఆయన వెంటనే ఉన్నది.
(నేపథ్యంలో ఆశ్విక సైన్యం వస్తున్న ధ్వనులు)
బ్రూటస్ : ఇష్. అతడు వచ్చేశాడు. అతడికోసం ప్రశాంతంగా ఎదురు వెళదాం.
కాషియస్, అతని సైనికులూ ప్రవేశిస్తారు.
కాషియస్ : ఓహో సైనికులారా! నిలవండి, ఆగిపొండి.
[[rh|జూలియస్ సీజర్||99}}