Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/869

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధారవోసి భావయుగముల కాదర్శమూర్తులై వర్తింతురనుటలో నాకేమాత్రమును సందేహము లేదు.”

“నా యిష్టానుసారముగ నైన మీతోనుండి తాత్కాలికమగు నపజయమున గలిగిన కష్టముల బాలు పంచుకొనువాడనే కాని నా మంత్రులు, నిత రున్నతోద్యోగులు బర్మాను వదలి స్వాతంత్ర్య సమరమును సాగింపవలసినదని కోరినారు. తూర్పు ఆసియాలో నున్న నాదేశీయు లెట్టి క్లిష్టస్థితిలో నైన సమరము సాగింతురు. వారు మీ ధైర్య సాహసముల, సత్త్వ, త్యాగముల మరచిపోరు.”

"21 అక్టోబరు 1943న నే గైకొనిన ప్రమాణము నెన్నడును విస్మరింపను. ముప్పది యెనిమిది కోట్ల భారతీయుల క్షేమ సౌభాగ్యములకే నేను యత్నింతును. ఈ యాశతోనే మీరును బ్రవర్తింపుడు. ఉషస్సునకు ముందెన్నడును నంధకారమే కనుపించును - జైహింద్"

నేతాజీ యా దేశము ననుసరించి జాతీయ సేన బోరాడుచున్నది మరొక మాసము కాలము శత్రువుల పురోగమన మాపగలిగినది. అందున్నవారు శారీరకముగ యుద్ధమునకు నిరుపయోగులు, రోగగ్రస్తులు.

నలుబది యైదుగురు సేనతో కర్నలు మెహరు దాసు, షానవాజ్ ఖానులు, మరి యితరోద్యోగులు తుముల యుద్ధములు సాగించినారు. కర్నలు ధాకూరు సంగు 'యక్సు పటాలము' నేతాజీని బాంకాకు వరకు జేర్చినది. దీనిని శత్రువులే మెచ్చుకొనినారు.

కెప్టెన్ లక్ష్మి నాయకత్వమున ఝాన్సీ దళము మోల్మీన్ యొద్ద శత్రుసేనలతో దలపడి విశేష నష్టము లేకుండ దిరోగమించినది. తుట్టతుదకు 16 మే 1945న సమస్త సైన్యములును శత్రువులకు లొంగిపోయినవి.

నేతాజీ అంగరక్షక సైన్యము మాత్రము వారికి లొంగలేదు. 9 ఆగష్టున జపనీయులు లొంగిపోయినారు. "జపనీయులు లొంగినారు, మేము లొంగ" మని నినాదములతో జాతీయ సైనికులు బాంకాకున గగ్గోలొనర్చుచున్నారు.

17 ఆగష్టున నేతాజీ బాంకాకు వచ్చి వారిని చూచినాడు. వారి యుత్సాహ నినాదములను విన్న తరువాత “మీరు లొంగిపొం”డని చెప్పుట కాయనకు మనస్కరింపలేదు. “నిజము మనము లొంగ”మని వారు చేయు నినాదములకు సమాధానము చెప్పి, తరువాత నెట్టైన వారిని బ్రిటిషువారికి లొంగిపోవునట్లు