ఆంటోనీ : ఆ జోక్యం కోసమేగదా మీతో మైత్రినాశించి కరచాలనం చేసింది! కానీ దృష్టి సీజర్ మీద నిలిచినప్పుడు నేను విషయం సర్వం మరిచిపోయినాను. నేను మీ అందరితో మైత్రినే అర్థిస్తున్నాను అంతే కాదు, మీ యెడ అనురాగం వహిస్తున్నాను ఏ రీతిగా, ఏ కారణంగా సీజర్ అపాయకారి అని మీరు భావించారో నాకు నిరూపిస్తారని ఆశిస్తున్నాను.
బ్రూటస్ : కారణాలు చెప్పి మేము నిన్ను తృప్తిపరచలేకపోతే చేసిందొక పాశవిక కృత్య మౌతుంది. మా కారణాలు ఎంతో బలవత్తరమైనవి. నీవే సీజర్ కు పుత్రుడవై ఉన్నా వాటిని విన్నప్పుడు అవి నిన్ను తృప్తి పరచగలవనే మా నమ్మకం.
ఆంటోనీ : నాకు కావలసింది కూడా అదే మరేమీ మిమ్మల్ని కోరబోను. అంతే కాదు, సీజర్ కళేబరాన్ని విపణి ప్రదేశానికి తీసుకోవెళ్ళి సభావేదికమీద నిల్చి, మిత్రుడికి యోగ్యమైన రీతిగా ఉపన్యసించేటందుకు నా కనుజ్ఞ ఇవ్వవలసిందని మిమ్మల్ని అర్థిస్తున్నాను.
బ్రూటస్ : ఆంటోనీ! అందుకు మేము అంగీకరిస్తున్నాం.
కాషియస్ : బ్రూటస్! ఒక్కమాట! (అపవారితం) ఏం చేస్తున్నారో మీకు అర్థం కావటంలేదు. సీజర్ అంత్యక్రియల సందర్భంలో అంటోనీ ఉపన్యసించ టానికి అంగీకరించకండి. అతడి ప్రసంగం వింటే జనం ఎంతగా చలించిపోతారో మీకు తెలుసునా?
బ్రూటస్ : క్షమించు. ముందుగా నేను వేదికెక్కి సీజర్ ను మన మెందుకు తుదముట్టించామో తెలియజేస్తాను. మా అంగీకారంతోటే ఆంటోనీ ప్రసంగిస్తున్నాడనీ, మా అందరికీ సీజర్ అంత్యక్రియోత్సవాలు సక్రమంగా సాగిపోవటం సంతోషకరమైన విషయమనీ ప్రజలకు ప్రకటిస్తాను. ఇందువల్ల మన సదుద్దేశాలు వారికి అర్థమైపోతాయి. మనకెంతో ప్రయోజనం చేకూరుతుంది.
కాషియస్ : ఈ పనివల్ల ఏం జరగనున్నదో నాకేమీ బోధ పడటం లేదు కానీ ఇది నాకు అణుమాత్రం మనస్కరించటం లేదు.
బ్రూటస్ : మార్క్ ఆంటోనీ! ఇదిగో, సీజర్ మృతకళేబరం. విపణి ప్రదేశానికి తీసుకోపో. నీ ఉపన్యాసంలో మామీద దోషారోపణలు చేయరాదు సుమా! సీజర్ ను గురించి ఎంతైనా మంచి చెప్పు. - అంతేకాదు, మా అనుజ్ఞతో మాట్లాడుతున్నా నని ప్రజలకు
జూలియస్ సీజర్
83