Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓ మహోదారులారా! మీ మహాశయాలేమిటో, ఇంకా ఎవరెవరి రక్తం స్రవించాలో నాకు తెలియదు. మీరు అందులో నన్ను ఒకణ్ణిగా భావిస్తే సీజర్ మరణించిన ఈ సమయంకంటే మంచిది నాకెక్కడ లభిస్తుంది? ప్రపంచంలో కెల్లా మహోదారమైన రక్తాన్ని మైపూత గావించుకొన్న మీ శస్త్రాలకంటే నా మృతికి మంచి సాధనా లెక్కడ దొరుకుతాయి? నా మీద మీకేమైనా ఉంటే రక్తారుణమైన మీ హస్తాలతడి ఆరకముందే మీ ఆనందాన్ని తీర్చుకోండి. నేను ఇంకా వేయి సంవత్సరాలు జీవించినా మరణించటానికి ఇంతకంటే సుసమయం నాకు కలగదు. సీజర్ తో పాటు మరణించే అవకాశాన్ని ప్రసాదించగల ఈ ప్రదేశం కంటే మరో తావు నాకు తృప్తిని కలిగించలేదు. ఈ యుగం ఎన్నుకున్న ఉత్తములూ, మహోదారాశయులూ అయిన మీ సాధనాల కంటే, సీజర్ మృతికి సాధనాలైన సాధనాలకంటే, మంచివి నా కెప్పుడూ లభించవు.

బ్రూటస్  : ఆంటోనీ! మరణదానం చెయ్యండని మమ్మల్ని అర్థించవద్దు. ప్రస్తుతం మేము నిర్వర్తించిన ఈ కృత్యం వల్ల మమ్మల్ని రక్తపిపాసువులుగా, క్రూరులుగా ప్రదర్శించే మా హస్తాలు మాత్రమే నీకు కనిపిస్తాయి కానీ మా హృదయాలు గోచరించవు. అవి కరుణారసపూరితాలు. రోముకు జరుగుతూ వచ్చిన అపచార విషయంలో అవి కరుణారసపూరితాలు. ఒక అగ్ని మరో అగ్నిని తరిమివేసినట్లు ఒక కరుణ మరో కరుణను తరిమివేసింది. రోము ప్రజలమీది మా కరుణ సీజర్ మీది కరుణను పారద్రోలింది సీజర్ యెడ ఈ కృత్యాన్ని చేయించింది. నీ యెడ మా ఖడ్గాలు బండవారినవి. వాటికి అంచులు తప్పినవి. మా శస్త్రాలు నిరంకుశత్వం విషయంలో ఈర్ష్యాయుతాలు. మా హృదయాలు నీ యెడ భ్రాతృప్రేమ వహిస్తున్నవి. నిన్ను ప్రేమతో, గౌరవంతో, సదుద్దేశంతో ఆహ్వానిస్తున్నవి.

కాస్కా : ఉద్యోగ ప్రదానాలలోనూ, పోషణత్వ పాలనలోనూ మా అందరితో తుల్యంగా నీ మాట చెల్లుబడి ఔతుంది.

బ్రూటస్ : ఇక్కడ గుమిగూడిన జనానికి భయాన్ని పోగొట్టి ప్రశాంతిని కల్పించేటంతవరకూ కొంచెం ఓపిక పట్టు. నీకు కారణాలను వినిపిస్తాము. సీజర్ యెడ అంతటి ప్రేమగల నేను గూడా ఎందుకతడి యెడ ఇలా ప్రవర్తించానో తెలియ జెపుతాను.

ఆంటోని  : మీ విజ్ఞానాతిశయంమీద నా కెన్నడూ సంశయం లేదు. మీలో ప్రతి ఒక్కరూ రక్తప్లావితమైన హస్తాలను నాకందివ్వండి. కరచాలనం చేస్తాను. మొదట


జూలియస్ సీజర్

81