అట్టివారిలో కొందరు మాత్రమే అతడికి వ్రాసుకొనేవారు. ఇందులో ఎక్కువమంది గురించి ఇతరులు వ్రాయటమో, అతడే ఎన్నటమో జరిగేది. వీరిలో కార్నెగీకి ప్రథమంగా ఉద్యోగమిచ్చిన వ్యక్తి కుమార్తె కూడా వుంది. అతడు ఒకప్పుడు పిట్స్బుర్గులో మంచి ఉచ్ఛదశను అనుభవించిన వ్యాపారస్థుని కుమారుడు, అతనికి బాల్యంలో కార్నెగీ అండీగా తంతివార్తలను అందజేస్తుండేవాడు. కాని ఇప్పుడతడు అశక్తుడు, పేదవాడు. పూర్వం అలిఘనీలో స్వీడన్బౌర్జియన్ సంగీతసమ్మేళనంలో సహ సభ్యులుగా వుండేవాళు ఇరువురూ వృద్ధకన్యలు, 'నేను యౌవనోల్లాసంతో వారితో కలిసి నృత్యం చేస్తుండేవాణ్ని' అని కార్నెగీ వ్రాశాడు.
ఆయన మృతి నొందే వేళకు పూర్వమే ఆ పట్టికలో ఐదు వందల పేర్లకు మించి వుండేవి. కాలం గడిచిన కొద్దీ ఇందుకు ఎక్కువ ధనం అవసరమని గ్రహించి ఈ భృతిని స్వీకరించేవారు. తమ కాభృతి జీవించినంత కాలం భృతి ముడుతుందనే నమ్మకాన్ని కల్పించటం కోసం, కార్నెగీ యాభై లక్షల డాలర్లతో మరొక ధర్మనిధి ఏర్పాటు చేశాడు. దీనికి తోడు స్కాట్లండులో మరొక పట్టిక ఏర్పాటు అయింది. దీనికి ధర్మకర్త డన్స్టర్డ్లోనులోని డాక్టర్ రాస్. ఈ పట్టికలోనే రాబర్టు బరన్స్ మునిమనుమరాలి పేరు, బాల్యంలో కార్నెగీకి అతిప్రియమిత్రుడైన డన్ఫర్మ్ లైన్ పోస్ట్మాన్ కుమార్తె పేరు వున్నవి.
ఒకరోజున న్యూ యార్క్ కార్నెగీ కార్పొరేషన్ అధిపతి అయిన కార్పొరేషన్ డాక్టర్ హెన్రీ యస్. ప్రిట్చెట్న ఇంటికి రమ్మని పిలిపించటం జరిగింది. అతడు వచ్చేటప్పటికల్లా కార్నెగీ తన డ్రాయింగ్ రూములో అటూ యిటూ తిరుగుతున్నాడు.
“డాక్టర్ ప్రిట్చెట్, అమెరికాలోని అధ్యక్షత క్రింది నడుస్తున్న సంస్థవంటి నొకదానిని కొద్ది ఎత్తులో నేను గ్రేట్ బ్రిటన్ కోసం ఏర్పాటు చేయదలిచాను. నిశ్చయంగా దాని కెక్కువ డబ్బు అవసరం లేకపోయినప్పటికీ, అది ఇవ్వటానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. నా భార్య కుమార్తెల కోసం విడిచిపెట్టిన డబ్బులో నుంచి నేను మళ్ళా ఒక పది మిలియన్లు తీయదలచలేదు. అందువల్ల మీ కార్పొరేషన్ ధనంలో నుంచి పది మిలియన్లు తీయదలిచాను" అన్నాడు.
డాక్టర్ ప్రిటెట్ కొంత సంకటపడ్డట్లు కనిపించి అన్నాడు . "మిస్టర్ కార్నెగీ, మీరా పని చేయటానికి వీలు లేదనుకుంటాను”
“వీల్లేదా?”