పింఛనుకు యేర్పాట్లు చేసి వారి విధవలకు పెన్షన్ల ఏర్పాటుతో కార్నెగి పౌండేషన్ ఏర్పాటు చేశాడు.
దాని ధర్మకర్తృత్వ సంఘంలో ఇరవై అయిదుమంది విశ్వవిద్యాలయాధ్యక్షులు, కళాశాలాధ్యక్షులు వున్నారు. వీరిలో చాలామంది అతనికి పూర్వమే మిత్రులైనవారు. ఈ నిర్మాణ సందర్భంలో వీరు కార్నెగీ గృహంలో సమావేశమైనప్పుడు, వీరికి కలిగిన భావాల్లో ఒకదానిని తాను మెచ్చుకొని, కార్నెగీ తాను ఎంతో ప్రీతిని వహించే మిత్రుల పట్టికలో వారిని చేర్చటం జరుగుతుంది. కార్నెగీ మిత్రుల పట్టికకు ఎప్పుడూ అంతు అనేది లేదు.
రెండు సంవత్సరాలైన తరువాత మరికొంత మొత్తం యాభై లక్షల డాలర్లు తరువాత మరొక మారు పన్నెండు లక్షల యాభైవేల కార్నెగీ ఆ ఫౌండేషనుకు చేర్చాడు. 1913లో కార్నెగీ కార్పొరేషను దానికి ఒక కోటి ఇరవై లక్షల డాలర్లు విరాళమిచ్చింది. మొదటి పాతిక సంవత్సరాలల్లో ఇది పదకొండు వందలమంది ఉపాధ్యాయులకు, వారి విధవలకు ఎలవెన్సు, పెన్షన్ల రూపంలో రెండు కోట్ల డాలర్లు వినియోగించింది. కార్నెగీ ఫౌండేషను, జాన్ డి. రాక్ ఫెల్లర్ జనరల్ ఎడ్యుకేషన్ బోర్డు అన్న సంస్థలు ఒకటి చేస్తున్న పనినే మరి రెండవది చేస్తున్నట్లు కన్పించినప్పుడు మిస్టర్ రాక్ ఫెల్లర్ "మీరు మా బోర్డులో యెందుకు సభ్యులుగా చేరకూడదు. అప్పుడు రెంటిలో ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది. దానివల్ల చేసిన పనిని తిరిగి చెయ్యటమనే దాన్ని నిలిపి వెయ్యవచ్చు" అని కార్నెగీతో అన్నాడు. కార్నెగీ ఉభయనిధులకు ఉపయోగించే టందుకుగాను రాక్ ఫెల్లర్ జనరల్ ఎడ్యుకేషన్ బోర్డులో సభ్యుడైనాడు.
ప్రసిద్ధ సంపాదకుడు, విమర్శకుడు, అతనికి సన్నిహితమిత్రుడు అయిన రిచ్చర్డు వాట్సిన్ల్డర్ ఒకమారు కార్నెగీ గురించి ఇలా వ్రాశాడు. "ఎ.సి. అనంతమైన సామర్థ్యం, అద్భుతమయిన భావనాబలం గలవాడు. అతని భావాలన్నీ అతివిశాలములైనవి. అంతేకాదు, భవిష్యదర్థసూచకములు. నేను ఇచ్చే అభిప్రాయం పొరబాటైంది. కాకపోతే అతడి కళంకరహితమయిన నైతికశీల మున్నది. అతడు పరిపూర్ణుడు కాకపోవచ్చును. కానీ అతడు మన అభిలాషను చూరగొన్న గలవాడు. విశిష్టత గలవాడు. సత్యమైన ప్రజాస్వామిక పౌరుడు. అతని లోకోపకార కృత్యాలన్నిటికీ మూలం ఉత్తమసిద్ధాంతాలు, శీలము అన్న గుణాలు రెంటిలో కన్పిస్తుంది." అతడే మరొక సందర్భంలో వ్రాస్తూ "ఎ.సి. నిజంగా ఒక మహావ్యక్తి, రసాత్ముడు, పట్టుదల గలవాడు. దయాళువు. అనేకవిషయాల మీద బుద్ధిని ప్రసరింపచేసేవాడు. కొన్ని