పిట్టెన్ క్రీప్" ఇది ఒక కథను తెలియజేస్తుంది. "నేను యింతకంటే మంచి క్రిస్మస్ బహుమానాన్ని పొందలేను” అన్నాడు లైయర్డ్. నేను జగత్తులోని బిరుదాలన్నిటిలోకి అత్యుత్తమమైన బిరుదును పొందినవాణ్ణి. రాజా అతడు కేవలం రాజే. అతడికి మాల్కొం రాజు శిఖరం లేదు. సెయింటు మార్గరెటు ఆలయం లేదు. పిట్టెన్ క్రీఫ్ గ్లెన్ లేదు. అతడు ఏమీ చూపలేదు. నేను అతడు డన్ఫర్మ్ లైన్కు యాత్రకు వస్తే, నేను దిగివచ్చి ఉదాత్తధోరణిలో అతడికి ఇవన్నీ చూపెడతాను. ఇది నాకెంతో ఆనందప్రదమైంది.”
ట్రస్టీలలో రాస్ ప్రథముడు కావటం తప్పదు కదా! వారికి వ్రాసి యిచ్చిన పత్రంలో కార్నెగీ తన వుద్దేశాన్ని ఇలా వెల్లడించాడు. "డన్ఫరైన్లో కష్టపడే శ్రామికజనుల విసుగుదలతో గూడిన జీవితానికి కొంత తీయదనాన్ని, కొంత వెలుగును ఇవ్వటానికి, ముఖ్యంగా యువకులకు ఇతర ప్రాంతాల్లో వసించేవారు పొందలేని కొంత తేజం, కొంత ఆనందం, కొంత ఉన్నతిని చేకూర్చేటందుకు, నా జన్మస్థానంలో బిడ్డ అనంతరకాలంలో అనంతర జీవితంలో వెనుకకు చూచుకొని, ఇంటి దగ్గరనుంచీ ఎంత దూరం తిరిగినప్పటికీ కేవలం తాను అక్కడ ఉండటమనే సుగుణం వల్ల, జీవితాన్ని ఆనందప్రదంగాను ఉత్తమంగాను చేసుకొనేటట్లు కల్పింపబడ్డదని భావించుకోవటం కోసం" అని వ్రాశాడు.
ఆస్తిని పెంచి దాని నిత్యపాలన కోసం ఒక పండును ఏర్పాటు చేసేటందుకుగాను ఇరవయ్యెదులక్షల డాలర్లు ఇచ్చి అతడు ట్రస్టీలను ఆశ్చర్యచకితులను చేశాడు. అతడు మరికొంత ఇచ్చిన తర్వాత ఆ మొత్తం ముప్పయ్యేడు లక్షల యేభైవేల డాలర్లు అయింది. ప్రజల ఆస్తి ఏదీ ఇంత జాగరూకతతో పాలింప బడలేదు. ప్రజలకు ఏదీ ఇంత ప్రీతిపాత్రమూ కాలేదు.
విశ్వవిద్యాలయం ట్రస్టీగా ఉండటం చేత, కార్నెగీ అక్కడ చదువు చెప్పేవారికి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నట్లు గమనించాడు. అతడు ఆతురతతో "ఇది అత్యుత్తమవృత్తిగా పరిగణింపబడవలసింది. అయినా అన్ని వృత్తులలోకీ ఉపాధ్యాయవృత్తికి చాలా అన్యాయంగా, నీచంగా ప్రతిఫలం ముడుతోంది. యువకులకు విద్య చెప్పటం కోసం జీవితాన్ని అంకితం చేసిన విద్యావంతులు మరీ అల్పభృతులను తీసుకొంటున్నారు.” అందువల్ల అతడు ఏప్రిల్ 16, 1905న విద్యాబోధనాభివృద్ధి కోసం అయిదు శాతం బాండ్లు రూపాన కోటి డాలర్లతో యునైటెడ్ స్టేట్స్ కెనడాల్లో ఉన్నతవిద్యకు దోహదమివ్వదలచి, విశ్వవిద్యాలయ కళాశాలలోపాథ్యాయులకు