కొంతకాలం డన్ఫర్మ్ లైన్ నివాసి, కార్నెగీ చేసిన కొన్ని ధర్మాలకు యితరమయిన తన ఆస్తులకు అతని ప్రతినిధి - డాక్టర్ జాన్ రాస్ 1900 ప్రాంతంలో కార్నెగీలను చూడడానికి వచ్చి, వారితో ఏకాంతంగా, “కల్నల్ హంట్ డన్స్లోనులోని తన ఆస్తులను అమ్మేసే సమయం వచ్చినట్లు తెలిసింది" అన్నాడు. రాస్.
"మంచిది! వాటిని నేను కొంటాను" అన్నాడు కార్నెగీ సంతోషంతో.
“అయితే, అతడు చెబుతున్న ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు తోస్తున్నది" అన్నాడు
ఇరువురూ ఈ విషయాన్ని గురించి మరి కొంతసేపు చర్చించారు. పరిస్థితి కనిపెట్టడానికి డాక్టర్ రాస్ స్కాబ్ జాగరూకతతో వ్యవహరించాలని ఇరువురూ నిశ్చయించారు. ఒక సంవత్సరం కాలం కాచుకున్న తరువాత డాక్టర్ రాస్ కార్నెగీ దగ్గరికి వచ్చాడు.
అతడు “ఎరోడింబరోలోని మిస్టర్ షాతో, (ఇతడు పూర్వం డన్ఫర్మ్ లైన్ ్వడు) కల్నల్ హంట్ ఏజంట్లతో కదల్చమని మనం చెప్పవచ్చు ననుకొంటున్నాను” అన్నాడు.
"బాగుంది. నాకు ఇచ్చి వేయకపోవడం వల్ల తరువాత వారి యజమాని చింతపడవలసి వస్తుంది. దాన్ని కొనటానికి మరొకడెవ్వడూ అంత చులకనగా రాడు. నేను మనస్సును మార్చుకోటానికిగాని, మరణించటానికి గాని అవకాశముంది అని వాళ్ళకు చెప్పండి" అన్నాడు కార్నెగీ . "ఆ విషయంలో ఎలా జాగ్రత్త పడాలో టాయ్ షా బాగా ఎరిగినవాడు" అన్నాడు రాస్.
దీనితరువాత కొద్దికాలానికే కార్నెగీ న్యూ యార్క్ వెళ్ళాడు.
కొన్ని వారాలు గడిచాయి. ఒకనాడు షా దగ్గర నుండి కేబిల్ వచ్చింది. "కల్నల్ హంట్ 45,000 పౌన్లకు ఒప్పుకుంటాడు. బేరం నిశ్చయించనా?"
“సరే. ఇది రాస్ పెట్టే షరతులన్నిటికీ అనుకూలంగా వుంటే అంగీకరించవచ్చు” అని సమాధానమిచ్చాడు.
కొద్ది రోజులు గడిచాయి. మధ్యాహ్నం బాగా గడిచిన తరువాత అది క్రిస్మస్ సాయంత్రం. షా దగ్గరనుంచి మరొక కేబిల్ వచ్చింది. "హెయిల్, లైయర్డ్ ఆఫ్