వెస్టర్న్ రిజర్వు యూనివర్సిటీలోని హెన్నాటైరు, వెలస్సీ (వెల్లస్లీ) లోని ఫ్రాన్సిస్ క్లీన్లాండ్ లైబ్రరీ ఇందు కుదాహరణాలు.
ఓహోయోలోని కెన్యాూన్ కాలేజీలో వున్న స్టాంటన్ ఖైర్ ఆఫ్ ఎకనమిక్స్, అధ్యక్షుడు లింకన్క యుద్ధకార్యదర్శి అయిన ఎడ్విన్ ఎం. స్టాంటన్ పేర నెలకొల్పినది. ఇతడు మొదట, ముక్కోపి అని ఎక్కువమంది అభిప్రాయం. అయినా, ఉక్కురాజు ఇతణ్ణి పిట్స్బర్గులోని న్యాయవాదిగా జ్ఞప్తి కుంచుకున్నాడు. న్యాయవాదిగా వున్న ఆ రోజుల్లో ఇతడు, ఆండ్రూ కార్నెగీ అన్న తంతి వార్తాహరి బాలుడితో ఎల్లప్పుడూ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉంటుండేవాడు.
అతడికి ఎక్కువ ఇష్టమైన దానాలలో ఒకటి అతడు డన్ఫర్మ్ లైన్ పార్కు, దానిలో వున్న చరిత్రాత్మకభవనాలను ఇవ్వటం. అక్కడివారు పార్క్ కావాలని బహుకాలం నుంచి వ్యామోహ పడుతున్నారు. కొన్ని తరాలుగా హంట్సు లైయర్డ్, ఫిట్టెన్, క్రీఫ్ గ్లెన్ల యాజమాన్యం క్రింద ఉంటున్న తమ ప్రాచీన వారసత్వాన్ని - పాత్ర అబ్బీ, దాని మైదానాలు, రాజభవనశిథిలాలు - తిరిగి పొందటం కోసం తమ గ్రామస్థులు చేసిన దీర్ఘయుద్ధాలను గురించిన కథలు, వాళ్ళకు పెద్దలు చెప్పగా విన్నవి, వాళ్ళు చెప్పటం వల్ల తాను విన్నవి ఆండ్రూకు బాల్యస్మృతుల్లోని అంశాలుగా మిగిలిపోయినవి. పిట్టెన్ క్రీఫ్ గ్లెన్ ఆ తగాదాకు చెందిన భూభాగంలో చేరిందే. ఇది నగరానికి సంబంధించిన రెండు ప్రధాన వీధులచే చుట్టబడింది. అరవై యెకరాలకు మించిన అందమైన రాతి ప్రదేశం. ఇందులో చిన్న అడవి వుంది. ఆండ్రూ చిన్ననాడు ఇది అతనికి ఎంత అందంగా కనిపించేది. అతనికి దీనితో పోల్చదగ్గది ఒక స్వర్గం మాత్రమే అని అనిపించేది. అతడు అందులో ప్రవేశించటానికి ఆటంకం వుంది. కనుక అతడు దాన్ని బయట నిలబడి మాత్రమే చూడగలిగాడు. హంట్స్మీద జరిగిన పోరాటానికి అతని మాతామహుడు మారిసన్ నాయకుడు, ఇతని మేనమామ బైలీ తరువాత నడచిన కోర్టే యుద్ధానికి నాయకుడు. అంతేకాదు. అతడు లైయర్డు కట్టిన కంచెలు బ్రద్దలుకొట్టడానికి గుంపును కూర్చినందుకు శిక్ష అనుభవించాడు కూడాను. ఆ తరువాత లైయర్డు గ్లెన్ లోపలికి ఏ మారిసన్నూ ప్రవేశింపనీయరాదని ఆజ్ఞాపించాడు. ఈ మారిసన్ అన్న పేరుతో కార్నెగీకి ఒక వర్గం బంధువులు కూడా చేరుతారు. అందువల్ల అంకుల్ లాడర్ డాడ్నైగ్లను ఇద్దర్నీ ఒక ఆదివారం మధ్యాహ్నవేళ ఆగ్లెన్ అంచు చుట్టూరా త్రిప్పి, దాని లోపలి భాగాన్ని చూడడానికి వీలయిన ఒక ఎత్తు ప్రదేశానికి తీసుకుపోయాడు.