12. సంకటస్థితి - పరిష్కారం
కార్నెగీ వాటాలలో కొన్నింటిని స్టాక్ మార్కెట్టులో ప్రవేశపెట్టేటందుకు యితరుల చేతుల్లోకి వాస్తవానికి బ్రోకర్ల చేతుల్లోకి, ప్రవేశపెట్టాలని ఫ్రీక్స్ ఎప్పుడూ వుద్దేశపడుతుండటం కార్నెగీకి తెలుసు. చివరకు పీట్స్బర్లు బ్యాంకరయిన ఒక కోటీశ్వరుడికి కార్నెగీ కంపెనీ వారి రెండు శాతం వాటాలను అమ్మి కొన్ని అభివృద్ధులను సాధించవలసిందని ఫ్రీక్స్ కంపెనీ కోశాధికారికి సూచన చేసినప్పుడు, దీనిని మించేటట్లుగా కోక్ ధరను గురించి కార్నెగీతో నోటిమాటగా చేసుకొన్న ఒడంబడికను బొత్తిగా త్రోసి పుచ్చినప్పుడు, సహజంగా శాంతస్వభావుడయిన ఆ స్కాచ్ దేశీయుడు ఉన్మత్తుడయినాడు.
హెన్రీ, ఫిప్స్, ఫ్రీక్స్ పక్షం వహించటం కార్నెగీని అన్నిటికంటె అధికంగా గాయపరచింది. ఫ్రీక్సన్న కంపెనీ నుంచి తొలగించాలని నిశ్చయించుకొని 1899 శరత్తులో కఠినముఖుడై ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతకు పూర్వం ఎన్నడూ భాగస్థులతో అతనికి తీవ్రమయిన వివాదాలేవీ రాలేదు. అయినా కార్నెగీ తప్పనిసరి అయి తాను తీసుకోవటానికి నిశ్చయించుకొన్న చర్యను అసహ్యించుకున్నాడు. తన స్టాకును యితరభాగస్థులకు అమ్మి, కంపెనీలో నుంచి ప్రశాంతంగా విరమించుకోమని అతడు ఫ్రీక్స్కు సూచన చేశాడు. అందుకు ఫ్రీక్స్ నిరాకరించాడు. ఈ కారణంగా ఖరీదయిన దావా నడించింది. అతన్ని పంపించి వేయటం కోసం రాజీ పడవలసి వచ్చింది. చివరకు ఫ్రీక్స్ వెళ్ళిపోయినాడు. తరువాత ఫ్రీక్స్ కార్నెగీతో సంధి యత్నాలు చేశాడు. వారిరువురూ తిరిగి మిత్రులయినారు. అయినా వెనుకటి సంవత్సరాలలో కనుపించిన సౌమనస్యం వారికి మళ్ళీ ఎన్నడూ చేకూరలేదు. తన్ను ఎన్నోరెట్లు మించిన కోటీశ్వరుడయి కూడా, తన పథకాలను నిరంతరం భగ్నం చెయ్యటమనే పనిగా పెట్టుకుంటాడని కార్నెగీ అంటే ఫ్రీక్స్కు అనిష్టం.
ఈ కలహం కార్నెగీని వ్యథ పెట్టింది. ఒక వంక అతడు వ్యాపారికమయిన బాధ్యతలనుంచి విడుదల పొందాలని అతిగా కుతూహలపడుతున్నాడు. మరొక వంక తన జీవితమంతా దేన్ని సాధించాడో దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటమన్న భావాన్ని