Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మిత్రునితో "మీకో విషయం చెప్పాలి. కొద్ది సంవత్సరాలకు పూర్వం లార్డు ఆక్టన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతని గ్రంథాలయాన్ని అమ్ముతానని సూచనచేస్తే...”

మోర్లే మొగాన ఉదయించిన చిరునవ్వు ఆ వాక్యాన్ని మధ్యలో ఆపింది. “ఈ విషయం మీరు కొన్న రోజునుంచి నేనెరుగుదును" అన్నాడతడు.

"మీకు తెలుసునా?"

“అవును. గ్లాడ్లైన్ రహస్యాన్ని నిలుపుకోలేకపోయినాడు. దానిని అతడు లార్డు ఆక్షన్కు జీవితపర్యంతం దక్కించగలిగినందుకు మహానందపడ్డాడు."

“బాగుంది. దాన్ని నేనిప్పుడు మీ పరం చెయ్యబోతున్నాను.”

“నా పరమా?” ఆశ్చర్యపడటం ఇప్పుడు మోర్లే వంతుకు వచ్చింది.

"ఔను. దానివల్ల సక్రమమైన ప్రయోజనాన్ని పొందటం మీకు బాగా తెలుసు. మీరు తరువాత దానిని విచ్ఛిన్నం కాకుండా చూసి, కావాలని మోహపడే ఒక సంస్థకు ఇచ్చివేస్తారని నమ్ముతున్నాను.”