Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరునాటి ఉదయం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బ్లెయిన్ ఆఫీసుకు వెళ్ళి కార్నెగీ అతన్ని పిలిచాడు. అతడు సంతోషంతో అతన్ని ఆహ్వానించాడు.

“గడచిన రాత్రి నీవు యిక్కడ వున్నట్లు మాకు తెలియజేయలేదేం?” అని అడిగాడతడు. "అధ్యక్షుడు మిసెస్ బ్లెయిన్తో నీవు నగరంలో వున్నావని చెప్పినప్పుడు ఆమె ఎంతో చింతపడ్డది. మిస్టర్ కార్నెగీ, నీవు ఎప్పుడీ నగరానికి వచ్చినా, మా గృహంలో నీకు ఒక ఖాళీ స్థానమున్నదని భావించు”

"రాత్రి మీ ఇంటి విందును పొందలేకపోయినందుకు ఎంతో చింతిస్తున్నాను” అన్నాడు కార్నెగీ “కానీ నిన్ను నిన్నటి రాత్రి కలుసుకోకపోవటం ఒక విధంగా నా అదృష్టం. ఇప్పుడు చూడటం వల్ల నేను అధ్యక్షుడు హారిసన్తో చేసిన చర్చను గురించిన విడిగా నీకు చెప్పడానికి అవకాశం కలిగింది.”

“అవును అది అదృష్టమే" అని కార్యదర్శి అంగీకరించాడు.

"అప్పుడు మనం కలిసి వున్నట్లయితే అధ్యక్షుడు ముందుగానే మనం కలిసే కూడబలుక్కున్నామని అనుకునే అవకాశముండేది”

అలా వాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుకునే సమయంలో పశ్చిమ వర్జీనియా సెనేటర్ ఎల్కిన్స్ లోపలికి వచ్చాడు. వచ్చిన ఆ వ్యక్తి కార్నెగీని చూడగానే నవ్వాడు. "నేను అధ్యక్షుడి దగ్గరనుంచి ఇప్పుడే వస్తున్నాను" అని అతడు, “ఆయన చిలీ విషయంలో నిన్న నీతో దీర్ఘమైన సంభాషణ చేశానని, ఆ విషయాన్ని గురించి నీవు ఆయనమీద విరుచుకు పడేటందుకు వచ్చావనీ అన్నాడు. శాంతిని గురించి కార్నెగీ అతితీవ్రంగా భావిస్తాడు అని నేనన్నాను. అతడు మీతో అంత గట్టిగా మాట్లాడితే నాతో ఎలా మాట్లాడుతాడో వినాలని ఉంది. నాతో మాట్లాడినట్లుగా మీతో అతడు అంత స్వేచ్ఛగా మాట్లాడడు. మాట్లాడినప్పుడు కొంత దాచుకొన్నట్లు మాటాడివుంటాడను కొంటాను అన్నాను. అధ్యక్షుడు "అతనిదగ్గర దాచుకోవటమన్న ఆ గుణం అణుమాత్రమైనా నాకేమీ కనిపించలేదని చెప్పాడు” అన్నాడు.

ఆ తరువాత బ్లెయిన్, ఎల్కిన్స్ ఇద్దరూ హృదయపూర్వకంగా నవ్వుకున్నారు.

మరునాటి సాయంత్రం భోజనం దగ్గర ఈ విషయం చర్చకు వచ్చింది. అయితే చర్చ ఎంతో మృదువుగా నడిచింది. అధ్యక్షుడి ఉద్రేకం కొంతగా చల్లబడుతున్నట్లు కార్నెగీ గమనించాడు. కార్యనిర్వాహక వర్గంవారు కూడా అధ్యక్షుడికి అనుకూలంగా లేనట్లు అతనికి అర్థమైంది.