ప్రభూ! మీ రహస్యాలేమో నాకు చెప్పండి. వాటిని నేను బయటపెట్టను. ఇందుకు ఆవశ్యకమైన నిశ్చలత నాకున్నదని నిరూపించటం కోసం ఇదుగో, ఈ ఊరువులో గాయాన్ని కల్పించుకుంటున్నాను. దీన్ని ఓర్పుతో భరించగలదాన్ని మీ రహస్యాలను భరించలేనేమో పరికించండి.
బ్రూటస్ : ఓ దేవతల్లారా! ఇంతటి ఉదాత్తప్రకృతి గల పత్నికి తగ్గ భర్తనుగా నన్ను తీర్చి దిద్దండి.
(లోపల తలుపుచప్పుడు)
వింటున్నావా, పోర్షియా, ఎవరో తలుపు తడుతున్నారు. నీవు కొంచెంసేపు లోపలికి వెళ్లు. నా రహస్యాలేమో నీకు కొద్ది కాలంలో తెలియజేస్తాను. నా ప్రవర్తన సర్వస్వాన్ని నీకు వెల్లడిస్తాను. దీనమై తోచే నా ముఖలక్షణానికి కారణం వినిపిస్తాను. - త్వరగా లోపలికి వెళ్ళు. (పోర్షియా నిష్క్రమిస్తుంది) లూషియస్, ఆ తలుపు తట్టేది ఎవరు?
(లిగారియస్ తొ తిరిగి లూషియస్ ప్రవేశిస్తాడు)
లూషియస్ : ఎవరో జబ్బుమనిషి మీతో మాట్లాడాలట!
బ్రూటస్ : మెటిల్లస్ చెప్పిన కేయస్ లిగేరియస్ ఇతడే అయి ఉంటాడు. లూషియస్, నీవు పక్కగా తొలుగు. కేయస్ లిగేరియస్! ఏమిటిది?
లిగేరియస్ : బలహీనమైన నా కంఠం పలికే ప్రణామ వాక్యాలను స్వీకరించండి.
బ్రూటస్ : కేయస్, సాహసికుడవైన నీవు జబ్బు పడటానికి బలే మంచి సమయాన్ని చూచుకున్నావే!
లిగేరియస్ : గౌరవప్రదమైన ఒక సాహసకృత్యానికి బ్రూటస్ పూనుకుంటే నేను జబ్బుపడ్డట్లే కాదు. నాకు జబ్బే ఉండదు.
బ్రూటస్ : నేను అట్టి చర్యకు పూనుకున్నాను. నీకు ఆరోగ్యం బాగా ఉండి ఉన్నట్లయితే అంతా విశదంగా చెప్పేవాణ్ణి.
లిగేరియన్ : నిత్యం రోము నివాసులు ప్రణమిల్లే దేవతల సాక్షిగా నేను నా రుగ్మతను పరిత్యజిస్తున్నాను. మీరు రోముకు అంతరాత్మలు. గౌరవనీయులైన మాతాపితరులకు జన్మించిన వీరపుత్రులు. ఒక ఐంద్రజాలికుడిలాగా వ్యథిత హృదయుడనైన నాకు
66
వావిలాల సోమయాజులు సాహిత్యం-3