నిర్మించటానికి పూనుకున్నాడు. 1881 వచ్చేటప్పటికల్లా ప్రపంచ మంతటిలోనూ మంచి కోకింగ్ బొగ్గును తయారుచేసే కోనెల్స విల్లీలోని ఎనభైవంతుల వ్యాపారాన్నంతటినీ ఇతడు హస్తగతం చేసుకొన్నాడు. అయితే చాలా అప్పుల్లో పడ్డాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇతడు ఒక పిట్స్బర్గ్ కన్యను వివాహమాడదలిచాడు. కొంతకాలం నుంచీ కార్నెగీ దృష్టి ఫ్రిక్ మీద పడ్డది. ఇతణ్ణి భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాడు. సర్వం ఇతని మీద విడిచిపెట్టి సంస్థకు బయట ఉండదగినంతటి సామర్థ్యం గలవాడితడు. వీళ్ళిరువురూ కలుసుకొని ఒక వ్యాపారపుటొడంబడిక చేసుకున్నారు. హనీమూన్ కోసం ఫ్రిక్, అతని భార్య న్యూ యార్క్క వచ్చినప్పుడు కార్నెగీ వాళ్ళను విందు కాహ్వానించాడు. ఆ సమయంలో తల్లి తప్ప మరెవ్వరూ అతిథులు లేరు. భోజనం ముగియబోయేముందు ఆతిథేయి లేచి నిలిచి, అతడు తన ఉత్తమమిత్రుడైన ఫ్రిక్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పాడు. అందులో "మిస్టర్ ఫ్రిక్, నేను భాగస్వాములము కాబోతున్నామని” చేర్చాడు.
ఇలా చేర్చి చెప్పటం ఈ రహస్యాన్ని ఇంతవరకూ ఎరుగని తల్లి ఉపయోగం కోసమే ఉద్దేశించబడ్డది.
“ఆండ్రా, ఇది ఫ్రిక్ కు ఎంతో మంచి విషయం" అని ఆమె వెంటనే సంతోషించింది. “ఇందువల్ల మనకేమి వస్తుంది?" అన్నది.
కొద్దికాలానికే జనవరి, 1, 1982న పదవ వంతు కార్నెగీ వర్గం వారి యాజమాన్యం గల స్టాకుతో హెచ్.సి. ఫ్రిక్ కోక్ కంపెనీ స్థాపితమైంది. ఈ సంస్థలో ఇలా ప్రారంభమైన కార్నెగీల యాజమాన్యం కాలక్రమేణా, ఫ్రిక్ కంపెనీ విధానాన్నంతటినీ నిర్ణయించేవారయినప్పటికీ, అది వారికి అత్యధిక ప్రతిపత్తి నిచ్చేటంతవరకూ పెరిగింది. ఈ మధ్య కాలంలో ఫ్రిక్, కార్నెగీ స్టీల్ కంపెనీలోని తన పెట్టుబడులను పెంచుకొన్నాడు.
లండన్కు వచ్చి బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ముందు అతని రచనను చదవవలసిందిగా ఆహ్వానింపబడేటంతటి ఖ్యాతి నార్జించుకున్న కెప్టెన్ బిల్ జోన్స్, ఈ నాడు ఉక్కు లోకంలో సుప్రసిద్ధుడయినాడు. అతడిప్పుడు హోమ్ స్టెడ్లోని వ్యవహారాలను చూస్తున్నాడు. తనకు ప్రియమైన మార్గాన్ని అనుసరించి జోన్స్కోసం కొంత స్టాకు వేరుచేసి, అతడు డివిడెండ్ల ధనంతో దాని విలువను చెల్లించుకొనే పద్ధతి మీద అతన్ని భాగస్వామిని చేద్దామనుకొన్నాడు. ఇందుకు ఇలా జరిగితే తాను